విజయ్ సేతుపతి (Vijay Sethupathi), శృతి హాసన్ (Shruti Haasan) జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏకకాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు (Jagapathi Babu), సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా రూపొందిస్తున్న సమయంలోనే దర్శకుడు జననాథన్ మరణించడం విషాదం. షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్కులో భాగంగా ఓ రోజు ఇంటికి వచ్చిన ఆయన.. అనూహ్యంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కాసేపటికి చిత్ర యూనిట్ వచ్చి చూసే సమయంలో అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా మారింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లినా కూడా ఓ రోజు తర్వాత ఆయన మరణించారు. జననాథన్ మరణించిన తర్వాత విడుదల అవుతున్న సినిమా కావడంతో అంతా బాగా ఎమోషనల్ అవుతున్నారు. ఈ సినిమాకు హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందింది.
వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా.. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన లాభం చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలవుతుంది. సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యింది. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ వచ్చింది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు అభినందించారు. దీంతో ఓ మంచి సినిమాను మా బ్యానర్‌లో ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా అనిపించింది. విజయ్ సేతుపతి డిఫరెంట్ పాత్రలో, లుక్‌లో కనిపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసేలా కమర్షియల్ హంగులతో డైరెక్టర్ ఎస్.పి.జననాథన్ సినిమాను రూపొందించారు. ప్రతి పాత్ర ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి, జగపతిబాబు పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.