కరోనా దెబ్బకు బన్నీ సినిమా నుంచి తప్పుకున్న విజయ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'.

news18-telugu
Updated: April 14, 2020, 1:26 PM IST
కరోనా దెబ్బకు బన్నీ సినిమా నుంచి తప్పుకున్న విజయ్..
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Pushpa Movie)
  • Share this:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టైటిల్‌ను ఇటీవలే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రబృందం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌ కేక పెట్టిసోంది. రఫ్ అండ్ రస్టిక్‌గా ఉండి అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. అయితే తాజాగావస్తోన్న సమాచారం మేరకు విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం విజయ్ సేతుపతి ఏప్రిల్ నెల మొత్తం డేట్స్ కేటాయించాడట. అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్ క్యాన్సల్ అయింది. ఈ నేపథ్యంలో వేరే సినిమాకు సమస్య రావడంతో డేట్స్ కుదరక ఈ సినిమా నుండి తప్పుకున్నాడట తమిళ స్టార్. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెకెక్కించబోతున్నారు. దీంతో హిందీ నుండి కూడా ఓ స్టార్ హీరోను ఈ సినిమాలో విలన్‌గా చూపించబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టిని విలన్ పాత్ర కోసం సంప్రదించారట చిత్రబృంతం. తన పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది.
First published: April 14, 2020, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading