Uppena- Vijay Sethupathi: ఈ నెలలో టాలీవుడ్లో విడుదలవుతోన్న క్రేజీ చిత్రాల్లో ఉప్పెన ఒకటి. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు హీరో హీరోయిన్లుగా.. లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచే ఈ మూవీ మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. ఆ తరువాత ఫస్ట్ లుక్, టీజర్, పాటలు, ట్రైలర్ ఇలా అన్నీ ఆకట్టుకుంటూ రావడంతో ఇప్పుడు ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. రాయణం అనే పాత్రలో విజయ్ నటించగా.. ట్రైలర్లోనే అతడి పాత్ర అర్థమైపోయింది. విజయ్ విలనిజం ఈ మూవీలో ఓరేంజ్‌లో ఉండబోతున్నట్లు ఇప్పటికే అభిమానులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు.
కాగా ఇందులో విజయ్ సేతుపతి పాత్ర గురించి సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతా పూర్తి అయిన తరువాత మూవీని చూసిన దర్శకుడు బుచ్చిబాబు సన దేవీశ్రీతో.. ''ఈ మూవీ తరువాత విజయ్ సేతుపతితో ఎవ్వరూ సెల్ఫీలు తీసుకోరేమో సర్'' అని అన్నారట. అలా అందరూ బయపడేలా సేతుపతి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటుందట. అంతేకాదు.. సినిమాపై తన భావాలను తనకంటే బాగా అర్థం చేసుకున్నారంటూ దేవీకి, బుచ్చిబాబు కితాబిచ్చారట. అది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని దేవీ శ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
అయితే ఉప్పెన ప్రారంభం అయినప్పటి నుంచే ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ తరువాత పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలతో ఈ మూవీపై మరింత అంచనాలను పెంచేసింది చిత్ర యూనిట్. లాక్డౌన్ వేళ పలు సినిమాలు ఓటీటీవైపు చూసినప్పటికీ.. ఈ మూవీ కథపై ఉన్న నమ్మకంతో థియేటర్లలో విడుదల చేసేందుకు ఎదురుచూశారు దర్శకనిర్మాతలు. ఇక ఈ మూవీ మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.