కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ తమిళంలో వచ్చిన 'తెన్మెర్కు పరువాకత్రు' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు. విజయ్ సేతుపతి తెలుగులో 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టాడు. 2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో ఆయన చేసిన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు.
ప్రస్తుతం విజయ్ బాలీవుడ్‌లో కూడా ఆఫర్లు అందుకున్నాడు. విజయ్ సేతుపతి నటనకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. భాష ఏదైనా పాత్ర ఏదైనా నటుడిగా ప్రేక్షకులను మెప్పించగల నటుడు విజయ్ సేతుపతి. అందుకే అతడ్ని వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న జవాన్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడట. కాగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం విజయ్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమా కోసం విజయ్ ని ఒప్పించడానికి అక్షరాలా 21 కోట్ల రూపాయలు పారితోషికం అందించనున్నారట.
ఇకపోతే విజయ్ సేతుపతి ఇటీవల విడుదలైన విక్రమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.విక్రమ్ లో కూడా విజయ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విక్రమ్ సినిమాలో ఆయన నటించిన పాత్రకు మంచి స్పందన రావడంతో తన రెమ్యునరేషన్ ను రూ15 కోట్ల ఏకంగా 21 కోట్ల మేరకు విజయ్ సేతుపతి పెంచాడని టాక్.అంటే ఒక్క సినిమాతో దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ పెంచేశాడు.ఈ విషయం తెలిసి కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jawan, Kollywood, Shah Rukh Khan, Vijay Sethupathi