ప్రస్తుత మార్కెట్‌లో పాన్ ఇండియా సినిమాలకు (Pan India Movies) మంచి డిమాండ్ ఉంది. పలు భాషలకు చెందిన స్టార్స్‌ని ఒకే తెరపై చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగు దర్శకనిర్మాతలు ఆ దిశగా అడుగులేసి టాప్ స్టార్స్‌తో సినిమాలు చేశారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కూడా అదే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చేయబోతున్న తన తదుపరి సినిమా కోసం భారీ స్కెచ్చేశారట త్రివిక్రమ్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఆయన మహేష్‌తో తలపడేందుకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని (Vijay Sethupathi) కన్ఫర్మ్ చేశారని సమాచారం.
ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు.. మరి కొద్ది రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్స్ మీదకు రాబోతున్నారు. ఆయన కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఫైనల్ అయింది. కథ ప్రకారం నటీనటుల ఎంపిక చేపట్టిన త్రివిక్రమ్.. ఈ సినిమాలో భారీ తారాగణం ఉండాలని డిసైడ్ అయ్యారట. అదేవిధంగా ఈ మూవీ విలన్ క్యారెక్టర్‌ని ఓ రేంజ్‌లో డిజైన్ చేసిన ఆయన.. ఈ రోల్ కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సంప్రదించారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆయన్ను స్వయంగా కలిసి స్క్రిప్ట్ వినిపించాలని ప్లాన్ చేస్తున్నారట.
త్రివిక్రమ్ రాసుకున్న కథ ప్రకారం ఈ మూవీ కొన్ని యాక్షన్ సీన్స్ భారీగా ఉన్నాయని, ముఖ్యంగా హీరో విలన్ తలపడే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అయ్యేలా ఉండబోతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే విజయ్ సేతుపతి లాంటి బడా స్టార్ కోసం త్రివిక్రమ్ ప్రయత్నాలు జరుగుతున్నాయట. విజయ్ సేతుపతికి తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో మంచి పాపులారిటీ ఉంది కాబట్టి ఎలాగైనా ఆయనతో గ్రీన్ సింగల్ తీసుకోవాలని త్రివిక్రమ్ ఫిక్సయ్యారట.
రీసెంట్‌గా సర్కారు వారి పాట సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు మహేష్ బాబు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కాస్త ఇబ్బంది పడుతున్నా మంచి టాక్ సొంతం చేసుకుంది. అదే జోష్‌తో త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి మహేష్ రాబోతున్నారు. ఇకపోతే మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో ఓ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రకటన వచ్చింది కానీ ఆ మూవీ వివరాలు మాత్రం పెద్దగా బయటకు రావడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.