Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తమిళంలో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’లో కీలక పాత్రలో నటించాడు. అంతేకాదు తెలుగులో త్వరలో ఉప్పెన సినిమాతో పలకరించనున్నాడు. మరోవైపు హిందీలో కూడా ఓ సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్గా విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమాలో విలన్ భవానీ పాత్రలో ప్రేక్షకులను భయపెట్టాడు. ఇలా ఒక మూసకే పరిమితం కాకుండా విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నాడు విజయ్ సేతుపతి. తాజాగా ఈయన నిన్న తన 43 పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సినిమా సెట్లోనే తన బర్త్ డే ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకన్నాడు. ఆ పుట్టినరోజు వేడుకలే విజయ్ సేతుపతిని వివాదాల పాలు చేసింది.
తన పుట్టినరోజు సందర్భంగా విజయ్ సేతుపతి .. బర్త్ డే కేక్‌ను చాకుతో కాకుండా.. ఓ ఖడ్గంతో కట్ చేయడం వివాదానికి కారణమైంది. అంతేకాదు ఈయన ఖడ్గంతో కేక్ కట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కేక్‌ను విజయ్ సేతుపతి ఖడ్గంతో కట్ చేయడంపై కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తప్పుపట్టారు. గూండాల మాదిరిగా ఖడ్గంతో బర్త్ డే కేక్ కట్ చేయడం ఏమిటి అంటూ విజయ్ సేతుపతి చేసిన పనిని ఏకి పారేసారు.
తర్వాత ఈ విషయం తెలుసుకున్న విజయ్ సేతుపతి.. కేక్‌ను ఖడ్గంతో కట్ చేసినందకు క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు తాను ఖడ్గంతో ఈ కేక్‌ను కట్ చేయడం వెనక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం తాను‘పొన్రం’ అనే సినిమా చేస్తున్నాను. అందులో ఖడ్గం కీ రోల్ ప్లే చేస్తోంది. అందువల్లే సినిమాలో నేను వాడుతున్న ఈ ఖడ్గంతోనే తన పుట్టినరోజు కేక్‌ను కట్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ‘పొన్రం’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ సెట్లోనే ఇదంత జరిగింది. ఏమైనా జరిగిన విషయంలో తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి ఆ వివాదానికి అక్కడే పులిస్టాప్ పెట్టేసాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 17, 2021, 07:40 IST