Home /News /movies /

VIJAY SETHUPATHI ANNOUNCED THAT HE WALKS OUT FROM MUTTIAH MURALITHARAN BIOPIC 800 PK

Muttiah Muralitharan Vijay Sethupathi: మురళీధరన్ బయోపిక్ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి..

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ (800 movie vijay sethupathi)

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ (800 movie vijay sethupathi)

Muttiah Muralitharan Vijay Sethupathi: శ్రీలంక లెజెండరీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఈ మధ్యే ప్రకటించారు. తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించాడు దర్శకుడు శ్రీపతి. కానీ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
శ్రీలంక లెజెండరీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఈ మధ్యే ప్రకటించారు. తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించాడు దర్శకుడు శ్రీపతి. కానీ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. శ్రీలంకన్ క్రికెటర్ బయోపిక్ ఇండియాలో చేయడం ఏంటి.. పైగా అందులో విజయ్ సేతుపతి నటించడానికి ఒప్పుకోవడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అంతేకాదు #ShameOnVijaySethupathi అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. తన బయోపిక్‌పై వస్తున్న ఈ కాంట్రవర్సీలు చూసిన మురళీధరన్.. తన బయోపిక్‌ నుంచి తప్పుకోవాలంటూ విజయ్‌ సేతుపతికి విజ్ఞప్తి చేసాడు. ఈ మేరకు ఓ పెద్ద లేఖ విడుదల చేసాడు ముత్తయ్య. దీనిపై విజయ్ సేతుపతి కూడా స్పందించాడు. మురళీధరన్ ట్వీట్‌కు స్పందిస్తూ "Thank you and goodbye" అంటూ చెప్పుకొచ్చాడు. మురళీధరన్ బయోపిక్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చెప్పాడు విజయ్ సేతుపతి. ఈ మేరకు మురళీధరన్ రాసిన లేఖ కూడా వైరల్ అవుతుంది.

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ (800 movie vijay sethupathi)
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ (800 movie vijay sethupathi)


తన బయోపిక్‌ '800' ప్రకటించిన తర్వాత కొందరు కొన్ని విమర్శలు చేసారని గుర్తు చేసాడు. కొందరి వ్యక్తులకు తనపై తప్పుడు అభిప్రాయం ఉందని.. అందుకే తన బయోపిక్ 800 నుంచి తప్పుకోవాలని విజయ్‌కు ఒత్తిడి పెరిగిందని చెప్పాడు మురళీ. ఈ నేపథ్యంలో తన కారణంగా అనవసరంగా తమిళనాడులో ఉన్న ఓ అద్భుతమైన నటుడు బాధ పడుతున్నాడని.. అతడి తప్పు లేకుండా శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పాడు మురళీధరన్. భవిష్యత్తులో విజయ్‌ సేతుపతికి కెరీర్‌ పరంగా ఎలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతోనే తన బయోపిక్ నుంచి ఆయన్ని తప్పుకోవాలని సూచించినట్లు తెలిపాడు. కెరీర్‌లో కూడా తనకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయని.. అలాంటి సమయంలో కూడా తను భయపడలేదని.. వెనకడుగు వేయలేదని చెప్పాడు మురళీ.

విజయ్ సేతుపతి (vijay sethupathi 800)
విజయ్ సేతుపతి (vijay sethupathi 800)


ఎప్పుడూ కష్టాలను చూసి కుంగిపోలేదని.. నిరుత్సాహపడలేదని చెప్పాడు ఈయన. తన బయోపిక్‌ యువతకు, యువ క్రికెటర్లలో స్ఫూర్తి నిస్తుందనే భావించి చేయడానికి ఒప్పుకున్నాను కానీ వేరే ఉద్దేశం లేదని చెప్పాడు మురళీధరన్. కానీ అది ఇప్పుడు జరగడం లేదు. అయినా కూడా ఈ అడ్డంకులను దాటి తన సినిమాను వాళ్ల దగ్గరకు చేరుస్తానని నమ్ముతున్నానని చెప్పాడు. నిర్మాణ సంస్థ చేసే ప్రయత్నాలకు తాను చేదోడు వాదోడుగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలబడిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు ముత్తయ్య మురళీధరన్. మరోవైపు విజయ్ మాత్రం ఈ విషయంపై అస్సలు స్పందించడం లేదు. తప్పుకున్నట్లు చెప్పి కామ్ అయిపోయాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Muthia Muralitharan, Tamil Cinema, Telugu Cinema, Vijay Sethupathi

తదుపరి వార్తలు