పూజా హెగ్డే, రష్మిక మందనకు పోటీగా ఆ హీరోయిన్‌ను దించుతున్న పూరి...

పూజా హెగ్డే, రష్మిక మందన, పూరి జగన్నాద్ Photo : Twitter

ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ రష్మిక మందన, పూజా హెగ్డేలు.

  • Share this:
    పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఫైటర్ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీలో కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఫైటర్ దాదాపు ఓ 40 రోజుల పాటు ముంబైలో షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగాల్సీ వుండగా.. కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేయనున్నారు. అయితే మొదటినుండి ఈ సినిమాలో విజయ్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్‌గా చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఏవో కారణాల వల్ల హీందీ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండేను విజయ్‌కు జోడిగా ఎంచుకుంది చిత్రబృందం. అనన్య పాండే గతంలో రెండు సినిమాలు చేసింది. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అనన్య ఆ తర్వాత 'పతి పత్ని ఔర్ వో' సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టరయినా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది అనన్య.

    అది అలా ఉంటే ఈ సినిమాతో తెలుగు వారికి పరిచయమవుతోన్న అనన్యకు అప్పుడే టాలీవుడ్ నుండి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయట. ఇక్కడి యువ హీరోలు ఆమెను తమ సినిమాల్లో రికమెండ్ చేస్తున్నారట. అందులో భాగంగా ఈ భామకు అడ్వాన్స్‌లు ఇవ్వడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదట మన నిర్మాతలు. దీంతో వరుస విజయాలు అందుకుంటూ ఊపేస్తోన్న రష్మిక మందన, పూజా హెగ్డేలకు ఈ భామ గట్టిపోటీ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇక తాజా సమాచారం మేరకు ఓ స్టార్ హీరో సరసన అనన్య హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందని టాక్. ఈ సినిమా గురించి త్వరలోనే ఓ ప్రకటన కూడా రానుంది.
    First published: