Vijay-Pooja Hegde | Beast Trailer Talk : తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో ఊపందుకున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ (Beast Trailer) చూస్తుంటే.. మాస్ అండ్ యాక్షన్ అంశాలతో వావ్ అనిపించింది. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ పట్ల సూపర్ హ్యాపీగా ఉన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో విజయ్ ఇండియన్ స్పై వీర రాఘవన్ అనే ఏజెంట్‌గా కనిపించి కేక పెట్టించారు. బీస్ట్ ట్రైలర్‌లో (Beast Trailer) అనిరుధ్ రవిచంద్రన్ నేపథ్య సంగీతం మరో రేంజ్‌లో ఉంది. చూడాలి మరి థియేటర్స్‌లో ఎలా ఆకట్టుకుంటుందో.. ఇక అది అలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్‌లోని కొన్ని సీన్స్ మాత్రం ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సిరీస్ మనీ హీస్ట్‌ను పోలి ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ విషయంలో చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. బీస్ట్ తెలుగు థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయని అంటున్నారు. దీనికి కారణం ఉంది. ఆయన గత సినిమా మాస్టర్ తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా 6 కోట్ల మేర బిజినెస్ చెయ్యగా.. దాదాపు 14 కోట్లు మేర వసూళ్లు అందుకొని తెలుగులో కూడా మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఆయన తాజాగా సినిమా బీస్ట్‌కు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే తెలుగులో బీస్ట్‌కు విజయ్ కెరీర్ లోనే రికార్డు ఫిగర్ కి థియేట్రికల్ హక్కులు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ 11 కోట్లకు అమ్ముడు అయ్యినట్లు టాక్ నడుస్తోంది.
ఇక బీస్ట్ ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో.. బాక్సాఫీస్ దగ్గర కెజియఫ్‌తో పోటీ పడాల్సి వస్తుంది. కన్నడ సంచలన చిత్రం KGF: చాప్టర్ 2 ఏప్రిల్ 14న వస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. దీంతో ఒక రోజు గ్యాపులో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. బీస్ట్ తమిళనాడులో KGF: చాప్టర్ 2ని డామినేట్ చేస్తుంది. కానీ సినిమా మిగతా అన్ని ప్రాంతాలలో మాత్రం KGF డామినేట్ చేయోచ్చని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన బీస్ట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. బీస్ట్ తెలుగు థియేట్రికల్ రైట్స్ ఇటీవలే అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని చెన్నై, జార్జియాల్లో భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అరబిక్ కుతు అనే సాంగ్ సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తోంది. అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం అందించారు. ఈ పాట విడుదలైన మొదటి రోజు నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట ఇప్పటి వరకు 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుని క్రియేట్ చేసింది. ఈ పాటను జోనితా గాంధీ, అనిరుధ్ (Anirudh Ravichander) పాడగా.. శివ కార్తికేయన్ లిరిక్స్ అందించారు.
#BeastTrailer sets the internet on fire ? 1M+ real time views in 5 mins ?
▶ https://t.co/WJQDt0BPXX@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @selvaraghavan @manojdft @Nirmalcuts @KiranDrk @anbariv #BeastModeON #BeastMovie #Beast pic.twitter.com/gQ4cu1fd4u — Sun Pictures (@sunpictures) April 2, 2022
ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ‘జాలీ ఓ జింఖానా’ (Jolly O Gymkhana) అనే టైటిల్‌తో విడుదలైన ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కూ కార్తిక్ రాసిన ఈ పాటను ఈ సినిమా హీరో (Thalapathy Vijay) విజయ్ స్వయంగా పాడారు. ఇక ఇప్పటికే బీస్ట్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే... గత ఏడాది శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు నెల్సన్. ఈ సినిమా కంటే ముందు నయనతారతో చేసిన కోకో సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఏకంగా విజయ్ హీరోగా సినిమా చేసే అవకాశం అందుకున్నారు. త్వరలోనే ఈయన రజనీకాంత్‌తో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beast Movie, Pooja Hegde, Tollywood news, Vijay