Home /News /movies /

VIJAY POOJA HEGDE BEAST TELUGU TRAILER TALK REVIEW FULL ACTION AND COMEDY TA

Vijay - Beast : విజయ్ ‘బీస్ట్’ తెలుగు ట్రైలర్ విడుదల.. ఆ దేశంలో మాత్రం ‘బీస్ట్’ మూవీపై బ్యాన్..

విజయ్ ‘బీస్ట్’ తెలుగు ట్రైలర్ విడుదల (Twitter/Photo)

విజయ్ ‘బీస్ట్’ తెలుగు ట్రైలర్ విడుదల (Twitter/Photo)

Vijay - Beast Telugu Trailer Talk | తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘బీస్ట్’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.

    Vijay - Beast Telugu Trailer Talk | తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే మూవీ చేసారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది.  ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి  పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో ఊపందుకున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ (Beast Trailer) చూస్తుంటే.. మాస్ అండ్ యాక్షన్ అంశాలతో వావ్ అనిపించింది. విజయ్‌ ఇండియన్‌ స్పై వీర రాఘవ అనే ఏజెంట్‌గా కనిపించి కేక పెట్టించారు.

    తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. ఒక షాపింగ్‌ మాల్‌ను టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా అక్కడే ఉన్న ఓ మిలటరీ స్పై ఏజెంట్ వీరరాఘవ.. టెర్రరిస్టులను నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడాడు అనేదే ఈ సినిమా స్టోరీ.   బీస్ట్ ట్రైలర్‌లో (Beast Trailer) అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఆర్ఆర్ మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. మరి థియేటర్స్‌లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక అది అలా ఉంటే.. ఈ సినిమా ఈ తెలుగులో కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే.


    ఈ సినిమా తెలుగు రైట్స్‌ను దిల్ రాజు (Dil Raju) దక్కించుకున్నారు. ఈ ట్రైలర్‌ను చూసిన నెటిజన్స్ మాత్రం.. ట్రైలర్‌లోని కొన్ని సీన్స్ మాత్రం ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సిరీస్ మనీ హీస్ట్‌ను పోలి ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    RRR 11 Days WW Collections : 11వ రోజు ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. దారుణంగా పడిపోయిన వసూళ్లు..

    బీస్ట్ తెలుగు థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయింట.   ఆయన గత సినిమా ‘మాస్టర్’ తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రూ. 6 కోట్ల మేర బిజినెస్ చెయ్యగా.. దాదాపు రూ. 14 కోట్లు మేర వసూళ్లు అందుకొని తెలుగులో కూడా మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఆయన తాజాగా సినిమా బీస్ట్‌కు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే తెలుగులో బీస్ట్‌కు విజయ్ కెరీర్ లోనే రికార్డు ఫిగర్ కి థియేట్రికల్ హక్కులు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ రూ. 11 కోట్లకు అమ్ముడు అయ్యినట్లు టాక్ నడుస్తోంది.

    Top Highest Gross Indian Movies : RRR సహా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు..

    ఇక బీస్ట్ ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో.. బాక్సాఫీస్ దగ్గర కెజియఫ్‌తో పోటీ పడాల్సి వస్తుంది. కన్నడ సంచలన చిత్రం KGF: చాప్టర్ 2 ఏప్రిల్ 14న వస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. దీంతో ఒక రోజు గ్యాపులో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. బీస్ట్ తమిళనాడులో KGF: చాప్టర్ 2ని డామినేట్ చేస్తుంది. కానీ సినిమా మిగతా అన్ని ప్రాంతాలలో మాత్రం KGF డామినేట్ చేయోచ్చని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన బీస్ట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమాకు కువైట్‌లో రిలీజ్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి.కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ బీస్ట్‌ను నిషేధించింది.

    కువైట్‌లో విజయ్ ‘బీస్ట్’ చిత్రం బ్యాన్ (Twitter/Photo)


    ఈ సినిమాలో పాక్ టెర్రరిస్టులతో పాటు ఇస్లామిక్ టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కించిన నేపథ్యంలో ఈ సినిమాను అక్కడ బ్యాన్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ ‘కురుపు’, ‘FIR’ వంటి చిత్రాలతో పాటు తాజాగా ‘బీస్ట్’ చిత్రాన్ని బ్యాన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Beast Movie, Kollywood, Pooja Hegde, Tollywood, Vijay

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు