హోమ్ /వార్తలు /సినిమా /

Vijay - Pooja Hegde - Beast : విజయ్, పూజా హెగ్డే ‘బీస్ట్’ మూవీ నుంచి రెండో సింగిల్ విడుదల..

Vijay - Pooja Hegde - Beast : విజయ్, పూజా హెగ్డే ‘బీస్ట్’ మూవీ నుంచి రెండో సింగిల్ విడుదల..

Vijay - Pooja Hegde - Beast : తమిళ స్టార్ హీరో విజయ్ గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు.

Vijay - Pooja Hegde - Beast : తమిళ స్టార్ హీరో విజయ్ గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు.

Vijay - Pooja Hegde - Beast : తమిళ స్టార్ హీరో విజయ్ గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు.

  Vijay - Pooja Hegde - Beast : తమిళ స్టార్ హీరో విజయ్ గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇపుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘బీస్ట్’ మూవీ చేసారు. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి సౌత్‌లో నెంబర్ వన్ కథానాయికగా ఇలాయిస్తోన్న పూజా హెగ్డే (Pooja Hegde) నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను జోరు మీద చేస్తున్నారు. ఈ కోవలో ఈ సినిమా నుంచివిడుదల చేసిన అరబిక్ కుతు అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  కొందరు మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఏదో మంత్ర దండం ఉంటుంది. వాళ్ళు ఒక పాట కంపోజ్ చేశారు అంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాంటి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. పదేళ్లుగా సౌత్ ఇండస్ట్రీని తన పాటలతో ఊపేస్తున్నాడు ఈ కుర్ర సంగీత దర్శకుడు. హీరో ఎవరైనా అనిరుద్ పాట వచ్చింది అంటే అది చార్ట్ బస్టర్ అవ్వాల్సిందే. ఈయన బుర్రలో నుంచి ఒకటి వచ్చింది అంటే అది ఖచ్చితంగా సోషల్ మీడియాలో వైరలే. ఇప్పటికే అరబిక్ కుతు పాట కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట ‘జాలీ ఓ జింఖానా’ పాటను రిలీజ్ చేశారు.

  తాజాగా ఆయన విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న బీస్ట్ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడు.  అనిరుద్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. గత ఏడాది శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు ఈ దర్శకుడు. దానికి ముందు నయనతారతో చేసిన కోకో సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఏకంగా విజయ్ హీరోగా సినిమా చేసే అవకాశం అందుకున్నాడు ఈయన. త్వరలోనే ఈయన రజినీకాంత్‌తో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడింది.

  RRR : ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ సాంగ్ మరో రికార్డు.. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మాస్ సాంగ్..

  ఇప్పటికే బీస్ట్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 14న విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే రోజు ఈ సినిమాను విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.  పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. ఈ సినిమా మొదటి పాట కోసం ఆరబిక్ తరహాలో ఉండే ట్యూన్ తీసుకొచ్చాడు అనిరుద్. ఈ పాట కోసం దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ ఇద్దరూ కలిసి ఒక స్కిట్ చేశారు. వాళ్లతో హీరో శివ కార్తికేయన్ కూడా జత కట్టాడు. ఈ అరబిక్ పాట రాసింది ఎవరో కాదు.. ఆయనే. డాక్టర్ సినిమాలో రెండు అద్భుతమైన పాటలను రాశాడు శివ కార్తికేయన్. ఈ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి దాంతో ఇప్పుడు విజయ్ సినిమా కోసం కూడా శివకార్తికేయన్ తోనే పాటలు రాయిస్తున్నాడు దర్శకుడు నెల్సన్. కచ్చితంగా రెండో పాట కూడా అదిరిపోయే హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నాడు అనిరుద్.

  First published:

  Tags: Beast Movie, Kollywood, Pooja Hegde, Vijay

  ఉత్తమ కథలు