హోమ్ /వార్తలు /movies /

Vijay | Beast : విజయ్-పూజా హెగ్డే బీస్ట్ అరబిక్ కుతు పాట మరో సంచలనం..

Vijay | Beast : విజయ్-పూజా హెగ్డే బీస్ట్ అరబిక్ కుతు పాట మరో సంచలనం..

Vijay-Pooja Hegde | Beast : తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇపుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ మూవీ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

    Vijay-Pooja Hegde | Beast : తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇపుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి  పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను జోరు మీద చేస్తున్నారు. ఈ కోవలో ఈ సినిమా నుంచివిడుదల చేసిన అరబిక్ కుతు అనే సాంగ్‌ను విడుదల చేశారు. అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం అందించారు.  ఈ పాట విడుదలైన మొదటి రోజు నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక పాట తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాట ఇప్పటి వరకు 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుని క్రియేట్ చేసింది. దీంతో టీమ్ దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పాటను జోనితా గాంధీ, అనిరుధ్ (Anirudh Ravichander) పాడగా.. శివ కార్తికేయన్ లిరిక్స్ అందించారు.

    ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ‘జాలీ ఓ జింఖానా’ (Jolly O Gymkhana) అనే టైటిల్‌తో విడుదలైన ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కూ కార్తిక్ రాసిన ఈ పాటను ఈ సినిమా హీరో (Thalapathy Vijay) విజయ్ స్వయంగా పాడారు. ఇక ఇప్పటికే బీస్ట్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 14న విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే రోజు ఈ సినిమాను విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.  పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తున్నారు.

    ఇక ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే... గత ఏడాది శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు నెల్సన్. ఈ సినిమా కంటే ముందు నయనతారతో చేసిన కోకో సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఏకంగా విజయ్ హీరోగా సినిమా చేసే అవకాశం అందుకున్నారు. త్వరలోనే ఈయన రజినీకాంత్‌తో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.

    First published:

    ఉత్తమ కథలు