Vijay Master Teaser: అదరగొడుతున్న విజయ్ ‘మాస్టర్’ తెలుగు టీజర్..
విజయ్, విజయ్ సేతుపతి (ఫైల్)
Vijay Master Movie Telugu Teaser Released: తమిళనాట ఒక ఊపు ఊపుతున్న విజయ్ ‘మాస్టర్’ సినిమా టీజర్ తెలుగులోనూ విడుదలైంది. విజయ్ తో పాటు ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించారు.
తమిళనాట ఒక ఊపు ఊపుతున్న విజయ్ ‘మాస్టర్’ సినిమా టీజర్ తెలుగులోనూ విడుదలైంది. విజయ్ తో పాటు ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించారు. తమిళ్ లో దీపావళి కానుకగా విడుదలైన ఈ టీజర్ ను.. తాజాగా తెలుగులో విడుదల చేసింది చిత్ర బృందం. ‘అది నాకు తెలుసు సార్.. జేడీ ఒక నేరస్థుడు.. ఒక పంతులుకు ఇంత ధైర్యం యాడ్నుంచి వచ్చింది...’ అంటూ ప్రారంభమయ్యే ఈ టీజర్ తమిళ్ లో మాదిరిగానే తెలుగులోనూ దుమ్ము రేపుతున్నది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ టీజర్ ను సుమారు 5 లక్షల మంది వీక్షించారు.
నిమిషంనర పాటు ఉన్న ఈ టీజర్ మాస్, క్లాస్ తో పాటు యూత్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అయితే మ్యాజిక్ చేశాడు. టీజర్ లో వచ్చే నేపథ్య సంగీతం యువతను ఉర్రూతలూగించేలా ఉంది. టీజర్ కే ఇలా ఉంటే.. ఇక సినిమాలో అనిరుధ్ ఏ రేంజ్ లో మ్యాజిక్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ హీరోగా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టీజర్ లోనూ ఆ ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్.
ఈ సినిమాలో విజయ్ సరసన మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి తో పాటు అర్జున్ దాస్, సిమ్రన్, ఆండ్రియా, తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికే వరస విజయాలతో దూసుకుపోతున్న విజయ్.. మాస్టర్ సినిమాతో మరిన్ని రికార్డులు తిరగరాస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. ఇప్పుడు వాళ్ల అంచనాలు రెండింతలు కాదు పదింతలు చేసేలా టీజర్ విడుదలైంది. స్టైలిష్ కాలేజ్ పొలిటికల్ డ్రామాగా మాస్టర్ వస్తుండగా.. ఇందులో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా నటిస్తున్నాడు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.