హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Master on Amazon Prime : అమెజాన్ ప్రైమ్‌లో విజయ్ మాస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా...

Vijay Master on Amazon Prime : అమెజాన్ ప్రైమ్‌లో విజయ్ మాస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా...

2. మాస్టర్: తెలుగు సినిమా కాకపోయినా కూడా తెలుగులో మంచి విజయం సాధించింది మాస్టర్. జనవరి 13న విడుదలైన మాస్టర్ సినిమా దాదాపు 12 కోట్ల షేర్ వసూలు చేసింది. విజయ్‌కు తెలుగులో మార్కెట్ భారీగా పెరిగింది అనేది మాస్టర్ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.

2. మాస్టర్: తెలుగు సినిమా కాకపోయినా కూడా తెలుగులో మంచి విజయం సాధించింది మాస్టర్. జనవరి 13న విడుదలైన మాస్టర్ సినిమా దాదాపు 12 కోట్ల షేర్ వసూలు చేసింది. విజయ్‌కు తెలుగులో మార్కెట్ భారీగా పెరిగింది అనేది మాస్టర్ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.

Vijay Master on Amazon Prime : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్టర్’.

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమాకు ఖైదీ సినిమాతో సూపర్ పాపులరైనా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఖైదీ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించడంతో అంచనాలు మరో రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఇక సినిమా ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకూ మాస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింతపెంచుతూ పోయింది. మాళవిక మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. మాస్టర్ పోయిన సమ్మర్‌లోనే విడుదకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా వాయిదా పడుతూ, వాయిదా పడుతూ చివరకు సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ లో కొన్ని సడలింపులు ఇచ్చారు. దీంతో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. అయితే యాబైశాతం మాత్రమే టిక్కెట్స్‌ను అందుబాటులో ఉంచాలి. ఇన్ని కండిషన్స్ మధ్య భారీ అంచనాల నడుమ విడుదలైన విజయ్ మాస్టర్ అందర్నీ అలరించలేకపోయింది. మాస్టర్ కేవలం విజయ్ ఫ్యాన్స్‌కు మాత్రమే అంటూ టాక్ బయటకు వచ్చింది.

అయితే మొదటి వారంలో భారీగా ధియేటర్స్ ఓపెనింగ్ ఉండడంతో ఎక్కువ థియేటర్స్‌లో విడుదలచేయడం వలన కలెక్షన్స్‌ అదిరిపోయాయి. తమిళం సంగతి ఎలా ఉన్నా తెలుగులో నిర్మాత లాభాలను గడించాడని అంటున్నాయి ఇండస్ట్రీవర్గాలు. తెలుగులో ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు విడుద‌ల చేశాడు.



ఇక అది అలా ఉంటే ఈ సినిమా డిజిటల్‌లో విడుదల ఎప్పుడంటూ అప్పుడే టాక్ మొదలైంది. అంతేకాదు మాస్టర్ త్వరలోనే డిజిటిల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోందని టాక్. తెలుస్తోన్న సమాచారం ప్రకారం మాస్టర్‌ను పాపులర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు డిజిటల్ రైట్స్ ని పొందిందని టాక్. ఇక ఈ సినిమాను వేలంటైన్స్ డే వీకెండ్ స్పెషల్ గా ఫిబ్రవరి 12 ను ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కు ఉంచనున్నారని తెలుస్తోంది. మాస్టర్ సినిమా విడుదలైన నెల రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే విధంగా.. మాస్టర్ మేకర్స్ అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. అందులో భాగంగానే మాస్టర్‌ను ఫిబ్రవరి 12న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలకానుంది.

First published:

Tags: Master, Tamil Film News, Vijay

ఉత్తమ కథలు