Vaathi Coming: గత ఏడాది కాలంగా ఓ పాట ఇండియాను ఊపేసింది. టిక్ టాక్ బ్యాన్ అయిపోయి బతికిపోయింది కానీ లేదంటే అందులో మరింత రచ్చ చేసేది ఆ పాట. అప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా ఆ పాటకు డాన్సులేసారు.
గత ఏడాది కాలంగా ఓ పాట ఇండియాను ఊపేసింది. టిక్ టాక్ బ్యాన్ అయిపోయి బతికిపోయింది కానీ లేదంటే అందులో మరింత రచ్చ చేసేది ఆ పాట. అప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా ఆ పాటకు డాన్సులేసారు. అదే వాతి కమింగ్. మాస్టర్ సినిమాలోని ఈ పాట సృష్టించిన సంచలనం గురించి మాటల్లో చెప్పడానికి సరిపోదు. ఎందుకంటే అలాంటి అరాచకం చేసింది ఇది. అనిరుధ్ సంగీతం అందించిన వాతి కమింగ్ పాటలో విజయ్ డాన్సులు సూపర్ ఫేమస్ అయ్యాయి. ఎంతగా అంటే.. టిక్ టాక్ ఉన్నపుడు అందులో ఈ ఒక్క పాటే రోజూ కనిపించేది. ఇప్పుడు ఈ పాట 100 మిలియన్స్ వ్యూస్ సాధించింది. విజయ్, మాళవిక మోహనన్ జంటగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ప్యాండమిక్ తర్వాత తొలి 100 కోట్ల సినిమాగా నిలిచింది మాస్టర్. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
ముఖ్యంగా వాతి కమింగ్ అయితే సంచలనాలు రేపింది. ఇప్పటికీ ఈ పాటకు అంతే ఆదరణ లభిస్తుంది. నెల రోజుల కింద ఈ పాటను అప్ లోడ్ చేసారు. కేవలం 30 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ అందుకుంది వాతి కమింగ్ పాట.
రోజుకు కనీసం 2 లక్షలకు పైగానే ఈ పాటకు వ్యూస్ వస్తున్నాయి. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే చాలా త్వరగానే 200 మిలియన్స్ క్లబ్బులో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.