Vijay Master teaser: మాస్టర్.. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఇది. 90ల్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే టైటిల్‌తో తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా చేస్తున్నాడు. ఒకప్పుడు ఈయన సినిమా..
మాస్టర్.. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఇది. 90ల్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే టైటిల్‌తో తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా చేస్తున్నాడు. ఒకప్పుడు ఈయన సినిమా వస్తుందంటే తెలుగులో పట్టించుకునే వాళ్లే కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ కూడా పరిస్థితులు మారిపోయాయి. విజయ్ సినిమాలకు తెలుగులో కూడా మార్కెట్ వచ్చింది. స్నేహితుడు నుంచి విజయ్ ఇక్కడ కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. తుపాకి పర్లేదు అనిపించినా ఆ తర్వాత అదిరింది, సర్కార్, విజిల్ సినిమాలతో తెలుగులో కూడా మాయ చేసాడు. దాంతో విజయ్ సినిమా అంటే తెలుగులోనూ 10 కోట్లు ఖాయం అనే నమ్మకం వచ్చేసింది. ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న మాస్టర్ సినిమాపై తెలుగులో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై తమిళనాట అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లోకేష్.
ఖైదీ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈయన నుంచి వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే వరస విజయాలతో దూసుకుపోతున్న విజయ్.. మాస్టర్ సినిమాతో మరిన్ని రికార్డులు తిరగరాస్తాడని నమ్ముతున్నారు నమ్ముతున్నారు అభిమానులు. ఇప్పుడు వాళ్ల అంచనాలు రెండింతలు కాదు పదింతలు చేసేలా టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత అంతా ఫిదా అయిపోతున్నారు. స్టైలిష్ కాలేజ్ పొలిటికల్ డ్రామాగా మాస్టర్ వస్తుంది. ఇందులో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండటం విశేషం.
విజయ్ మాస్టర్ పోస్టర్ (Thalapathy Vijay)
విజయ్, విజయ్ సేతుపతి మధ్య సాగే సన్నివేశాలు టీజర్లో హైలైట్. లోకల్ గూండా పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. మరోవైపు విజయ్ కాలేజ్ ప్రొఫెసర్‌గా కనిపిస్తున్నాడు. మాళవిక మోహనన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు మేజర్ హైలైట్. తెలుగులో కూడా ఈ సినిమా 11 కోట్లకు అమ్ముడైంది. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాతే మాస్టర్ విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.