Hero Vijay - Mater: ఆన్‌లైన్‌లో లీకైన విజయ్ ‘మాస్టర్’... షాక్‌లో చిత్ర యూనిట్, ఫ్యాన్స్

Vijay Master Movie leaked online shocks movie unit and fans

Hero Vijay - Mater: విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ సినిమా జనవరి 13న విడుదల కానుంది. అయితే చిత్ర యూనిట్‌కి అనుకోని షాక్ తగిలింది

  • Share this:
    సంక్రాంతి సీజ‌న్ స్టార్ట్ అయ్యింది.. కోవిడ్ ప్ర‌భావంతో మూత‌ప‌డ్డ థియేట‌ర్స్ యాబై శాతం ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయ్యాయి. క్ర‌మంగా సినిమాలు థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతున్నాయి. ఇప్ప‌టికే ర‌వితేజ క్రాక్ సినిమా విడుద‌లైంది. ఇప్పుడు తదుప‌రి చిత్రంగా విజ‌య్ మాస్ట‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్న త‌రుణంలో అనుకోకుండా మాస్టర్ చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్ త‌గిలింది. సినిమాలోని కీల‌క స‌న్నివేశాలు కొన్ని ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇలా విడుద‌ల కావ‌డం చిత్ర యూనిట్‌కు నిరాశ‌ను క‌లిగించే అంశం. దీంతో చిత్ర యూనిట్ దిద్దుబాటు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది.

    ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్ స‌హా సినీ అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేసుకున్నాడు. చాలా మంది సాంకేతిక నిపుణులు, న‌టీన‌టులు ప‌డ్డ క‌ష్టం. దాన్ని థియేట‌ర్స్‌లోనే చూసి ఎంజాయ్ చేస్తే బావుంటుంది. ఏడాదిన్న‌ర ప‌డ్డ‌క‌ష్టం. ఆన్‌లైన్‌లో లీక్ అయిన క్లిప్స్‌ను ద‌య‌చేసి షేర్ చేయ‌కండి. ఓ రోజు మాత్ర‌మే ఉంది. సినిమాను థియేట‌ర్స్‌లో చూద్దామంటూ లోకేశ్ క‌న‌క‌రాజ్ రిక్వెస్ట్ చేశాడు.

    న‌గ‌రం, ఖైది చిత్రాల త‌ర్వాత లొకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మాస్ట‌ర్ సినిమాలో మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టించింది. భారీ అంచ‌నాల న‌డుమ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. జ‌న‌వ‌రి 13న సినిమా విడుద‌ల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు విడుద‌ల చేస్తున్నారు.
    Published by:Anil
    First published: