Pawan Kalyan - Vijay: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాను బీట్ చేసిన విజయ్ ’మాస్టర్’ మూవీ. వివరాల్లోకి వెళితే.. 2021లో ఎక్కువ పాపులర్ అయిన టాప్ చిత్రాలను, వెబ్ సిరీస్‌లను ఐఎండీబీ ప్రకటిచింది. ఇందులో తమిళ స్టార్ హీరో నటించిన ‘మాస్టర్’ సినిమా నంబర్ వన్ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత ఆస్పిర్టన్స్ వెబ్ సిరీస్, ది వైట్ టైగర్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా యాక్ట్ చేసిన ‘నవంబర్ స్టోరీస్’ వెబ్ సిరీస్ ఐదో ప్లేస్‌లో నిలిచింది. ఇక ధనుశ్ నటించిన ‘కర్ణన్’ చిత్రం ఆరో ప్లేస్‌లో నిలిచింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా 7 ప్లేస్‌లో నిలిచింది. ఇక రవితేజ, గోపీచంద్ మలనినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘క్రాక్’ సినిమా 9వ ప్లేస్‌లో నిలిచింది.
ఇక విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమా తమిళంలో పాటు తెలుగు, హిందీ,కన్నడ, మలయాళంలో ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన కరోనా లాంటి కష్ట సమయంలో రూ. 200 కోట్ల వరకు రాబట్టింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించారు. మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది. ఇక పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ విషయానికొస్తే.. ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కింది. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసారు.
ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలైంది. అప్పటికే కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. ఈ సినిమా ఫుల్ థియోట్రికల్ రన్‌లో రూ. 80 కోట్ల షేర్ రాబట్టింది. ఒక వేళ కరోనా ఉదృతి లేకపోయి ఉంటే.. అంచనాలకు మించి వసూళ్లు ఉండేవి. ఈ సినిమా విడులైన మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయింది. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.