Vijay Master First Day Collections: విజయ్ ‘మాస్టర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. మరోసారి సత్తా చూపెట్టిన ఇళయ దళపతి..

విజయ్ ‘మాస్టర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ (Twitter/Photo)

Vijay Master First Day Collections: తమిళ స్టార్ హీరో  విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఫస్ట్ డే తమిళంలో పాటు తెలుగులో ఎంత మేరకు వసూళ్లను రాబట్టింది అంటే..

  • Share this:
    Vijay Master First Day Collections: తమిళ స్టార్ హీరో  విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఖైదీ తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించడంతో అంచనాలు మరో రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఇక సినిమా ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకూ మాస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. మాళవిక మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ చివరకు జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా తమిళంలో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో  విడుదలైంది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

    కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. ఇప్పటికే తెలుగులో సాయి తేజ్ సోలో బతుకే సో బెటర్ విడుదలై పరవాలేదనిపించింది. తాజాగా రవితేజ క్రాక్ కూడా విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ మూవీ తెలుగులో ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ రాబట్టింది. 50 శాతం ఆక్యుపెన్షీతో తెలుగులో దాదాపు 5.74 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలంగాణ (నైజాం)లో 1.49 కోట్లు, రాయలసీమ (సీడెడ్) 1.1 కోట్లు కొల్లగొట్టింది. మిగతా ఏపీలో కలిపి 3.24 కోట్లు కొల్లగొట్టింది.

    తమిళనాడు విషయానికొస్తే.. సగం థియేటర్స్ ఆక్యుపెన్షీతో మంచి వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో ఈ సినిమా మొదటి రోజు.. దాదాపు రూ. 26 కోట్లను కొల్లగొట్టినట్టు తమిళ సినిమా అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై ట్విట్టర్‌లో వివరించారు.



    ఓవర్సీస్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాలో రూ. 1.61 కోట్లు, న్యూజిలాండ్‌లో 28.84 లక్షలు, యూఎస్‌లో కొన్ని స్క్రీన్స్‌లలో ప్రదర్శించారు. మొత్తంగా మొదటి రోజు ఓవర్సీస్‌లో రూ. 2.5  కోట్ల వరకు కొల్లగొట్టింది. మొత్తంగా మిగతా అన్ని భాషల్లో కలిపి రూ. 33 కోట్ల గ్రాస్ వసూళ్లను కరోనా సమయంలో రాబట్టి ఔరా అనిపించింది.


    మొత్తంగా తమిళనాడుతో పాటు తెలుగులో కూడా జనవరి 14 సంక్రాంతి రోజున కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా సంక్రాంతి పండగ తర్వాత ఏ మేరకు నిలబడుతుందనే విషయం స్పష్టమవుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: