తమిళ స్టార్ హీరో ఇళయతలపతి విజయ్ నటించిన బిగిల్ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఎక్కడ చూసినా బిగిల్ మేనియా కనిపిస్తోంది. థియేటర్ల ముందు ఫ్యాన్స్ భారీగా బారులు తీరి కనిపిస్తున్నారు. అభిమాన హీరోకి పాలాభిషేకాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్ర విడుదల నేపథ్యంలో చెన్నైలోని కృష్ణగిరిలో ఉన్న మూడు థియేటర్ల వద్ద అభిమానులు బీభత్సం సృష్టించారు.స్పెషల్ షో వేయలేదన్న కారణంగా థియేటర్‌పై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు,థియేటర్ ముందున్న దుకాణాలకు నిప్పంటించారు.అక్కడి కూడలిలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్‌ను సైతం ధ్వంసం చేశారు. 'బిగిల్' స్పెషల్ షో వేసేంతవరకు తాము వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయక తప్పలేదు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా హింసకు పాల్పడిన 37మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. వారిలో కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. థియేటర్ పైకి వారు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి.
బిగిల్ స్పెషల్ షోలకు తమిళనాడు ప్రభుత్వం కాస్త ఆలస్యంగా అనుమతినిచ్చింది. గురువారం అర్థరాత్రి ఒంటిగంట నుంచి ప్రదర్శనలకు అనుమతినిచ్చింది.అయితే ప్రభుత్వం అనుమతినిచ్చినా సరే.. థియేటర్లలో బిగిల్ స్పెషల్ షో వేయకపోవడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఇదిలా ఉంటే, బిగిల్ సినిమాలో విజయ్ మూడు భిన్నమైన పాత్రల్లో అదరగొట్టాడని అభిమానులు చెబుతున్నారు. సినిమాకు అన్నిచోట్ల నుంచి మంచి స్పందన వస్తుండటంతో భారీ కలెక్షన్లు ఖాయమంటున్నారు.
Published by:Srinivas Mittapalli
First published:October 25, 2019, 14:00 IST