అమ్మాయిలకు నిద్ర లేకుండా చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..

ఆటిట్యూడ్‌తో స్టార్‌డమ్ సంపాదించుకుంటున్న విజయ్ దేవరకొండ అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టేలా మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.

news18-telugu
Updated: November 3, 2019, 12:00 PM IST
అమ్మాయిలకు నిద్ర లేకుండా చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ
  • Share this:
అతడికి హిట్లతో సంబంధం లేదు.. ఆటిట్యూడ్‌తోనే రిలేషన్. సినిమా హిట్టైనా, ఫట్టైనా లెక్కలేదు.. ఫ్యాన్స్ ఫాలో అయ్యారా? అన్నదే లెక్క. ఒక్కో సినిమాలో ఒక్కోలా, ఒక్కో కేరెక్టర్‌తో కొత్త అభిమానులను సృష్టించుకుంటూ దూసుకుపోతున్నాడు. యంగ్, టాలెంటెడ్, ఎనర్జిటిక్.. ఇలా ఎన్ని అన్నా అతడికి సరిగ్గా సూట్ అవుతాయి. పొగడ్తలే కాదు.. తిట్లను కూడా ఆమోదించగల వ్యక్తిత్వం, ఎవరేమనుకున్నా తనకు పట్టింపులేదన్నట్లు ఉండే బిహేవియర్‌తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమా హిట్లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఈ అర్జున్ రెడ్డి అమ్మాయిల గుండెల్లో ప్లేస్ కన్‌ఫామ్ చేసేసుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ అనగానే మన్మథుడు అనేలా తన ఇమేజ్‌ను ఓ రేంజ్‌లో పెంచుకుంటున్నాడు. ఆటిట్యూడ్‌తో స్టార్‌డమ్ సంపాదించుకుంటున్న ఈ యంగ్ హీరో అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టేలా మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

అయితే, పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ అనే సినిమాలోనూ విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుంది. అయితే, ఇస్మార్ట్ శంకర్ హిట్‌తో జోష్ మీదున్న పూరీ.. ఫైటర్ సినిమాలో విజయ్‌ని కొత్తగా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ స్క్రిప్ట్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటి నుంచే అతడు కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. పాత్రకు తగ్గట్లు తన శరీరాన్ని తయారు చేసుకుంటున్నాడు.

పూరీ జగన్నాథ్ ఛార్మి కౌర్‌తో కలిసి ఫైటర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒక హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ కోసం పూరీ వెతుకులాటలో ఉన్నట్లు సమాచారం.

First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>