విజయ్ ‘వాట్ ద ఎఫ్’ పాటపై అభ్యంతరాలు...యూట్యూబ్ నుంచి తొలగింపు!

విడుదలైన కొద్దిసేపటికే పాటలోని పదాలపై విమర్శలు... వెంటనే యూట్యూబ్‌ నుంచి తొలగించిన చిత్ర బృందం...కొత్త పదాలను చేర్చి రీ- రిలీజ్ చేస్తామని ప్రకటించిన శ్రీమణి!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: July 27, 2018, 4:54 PM IST
విజయ్ ‘వాట్ ద ఎఫ్’ పాటపై అభ్యంతరాలు...యూట్యూబ్ నుంచి తొలగింపు!
విజయ్ దేవరకొండ పాట పాడుతున్న పోస్టర్
  • Share this:
సెన్సెషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో తెగ బిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యనే ‘ట్యాక్సీవాలా’ సినిమాను పూర్తిచేసిన విజయ్, ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్లో పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ‘గీతా గోవిందం’ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో ఓ పాట కూడా పాడాడు విజయ్ దేవరకొండ. ‘వాట్ ద ఎఫ్...’ అంటూ సాగిన ఈ పాట 26 జూలై ఉదయం 11 గంటల 55 నిమిషాలకు రిలీజ్ చేశారు.

విడుదలయ్యిన కొద్దిసేపటికే మిలియన్ వ్యూస్ కూడా దాటింది విజయ్ పాడిన మొదటి పాట. అయితే ఈ పాటలో కొన్ని అభ్యంతకర పదాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. పల్లవిలోనే బూతు మాట ఉన్న ఈ పాట చరణాలలో సీతాదేవి, సావిత్రిల ప్రస్తావన కూడా వచ్చింది. దాంతో యూట్యూబ్ నుంచి ఈ పాటను తొలగించింది చిత్ర బృందం.

దీనిపై స్పందించిన పాట రచయిత శ్రీమణి... ‘‘గీతా గోవిందంలో ‘వాట్ ద ఎఫ్’ పాటలోని కొన్ని పదాలు, కొంతమంది మనోభావాలను గాయపరిచాయనే వార్తలు వచ్చాయి. అయితే ఎవ్వరినీ నొప్పించాలనే ఉద్దేశంతో ఈ పదాలు పెట్టలేదు అయినా ఎవ్వరినీ కించపరచడం ఇష్టంలేక ఈ పాటను తొలగించాం. త్వరలోనే కొత్త పదాలను చేర్చి పాటను తిరిగి అప్‌లోడ్ చేస్తాం...’’ అని చెప్పాడు. ఈ సినిమాలో విజయ్ సరసన ‘ఛలో’ భామ రష్మికా మందానా హీరోయిన్‌గా నటిస్తోంది.
Published by: Ramu Chinthakindhi
First published: July 27, 2018, 4:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading