Vijay Deverakonda: కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు .. విజ‌య్ దేవరకొండ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా..!

విజ‌య్ దేవ‌ర‌కొండ(ఫైల్ ‌ఫొటో)

టాలీవుడ్‌లోనూ ప‌లువురు సెలబ్రిటీలు సెల‌బ్రేష‌న్స్‌కి సిద్ధ‌మ‌వ్వ‌గా.. సెన్సేష‌నల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ(Vijay Deverakonda) కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం గోవాకు ప‌య‌న‌మ‌య్యారు. ఈ క్రమంలో దేవ‌ర‌కొండ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ల‌గా.. అక్క‌డ కెమెరాలు క్లిక్ మ‌నిపించాయి

  • Share this:
    Vijay Deverakonda: కొత్త సంవ‌త్స‌రం వ‌చ్చేందుకు మ‌రో ఒక్క రోజు మాత్ర‌మే ఉంది. దీంతో అన్ని చోట్ల‌ హ‌డావిడి మొద‌లైంది. కొన్ని ప్ర‌దేశాల్లో కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లకు అనుమ‌తి ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. మ‌రికొన్ని ప్ర‌దేశాల్లో క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ సెల‌బ్రేష‌న్స్ చేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చారు. ఈ క్రమంలో కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను చేసుకునేందుకు సెల‌బ్రిటీలు రెడీ అవుతున్నారు. క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ.. వారు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకోవాల‌నుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప‌లువురు నటీనటులు టూర్ల‌కు వెళ్లారు. ఇటు టాలీవుడ్‌లోనూ ప‌లువురు సెలబ్రిటీలు సెల‌బ్రేష‌న్స్‌కి సిద్ధ‌మ‌వ్వ‌గా.. సెన్సేష‌నల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం గోవాకు ప‌య‌న‌మ‌య్యారు. ఈ క్రమంలో దేవ‌ర‌కొండ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ల‌గా.. అక్క‌డ కెమెరాలు క్లిక్ మ‌నిపించాయి. అందులోమాస్క్‌తో ద‌ర్శ‌న‌మిచ్చాడు విజయ్ దేవ‌ర‌కొండ‌.

    కాగా అక్కడి నుంచి వచ్చిన తరువాత విజయ్ దేవరకొండ ఫైటర్ షూటింగ్‌లో పాల్గొనబోతున్న‌ట్లు తెలుస్తోంది. పూరీ జ‌గ‌న్నాథ్ ఫైట‌ర్‌ని తెర‌కెక్కిస్తుండ‌గా.. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తోంది. తెలుగు, హిందీలో రాబోతున్న ఈ మూవీలో విజ‌య్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. లాక్‌డౌన్ ముందే ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌గ్గా.. చాలా భాగం షూటింగ్‌ పూర్తి అయ్యింది.



    అయితే ఆ మ‌ధ్య‌న ఈ ప్రాజెక్ట్‌పై మ‌ళ్లీ రూమ‌ర్లు వ‌చ్చాయి. బ‌డ్జెట్ ఇబ్బందుల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిన‌ట్లు టాక్ న‌డిచింది. కానీ ఆ వార్త‌ల‌ను టీమ్ కొట్టేసింది. ఇటీవ‌ల ఫైట‌ర్ కోసం విజ‌య్ మ‌ళ్లీ క‌స‌ర‌త్తుల‌ను ప్రారంభించగా.. అత‌డిపై పూరీ ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 3 నుంచి ఫైట‌ర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ముంబ‌యిలో ఓ లాంగ్ షెడ్యూల్‌ని ఆ త‌రువాత బ్యాంకాంక్‌లో కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ త‌రువాత విజ‌య్.. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ల‌వ్ స్టోరీలో న‌టించ‌నున్నారు. ఆ త‌రువాత లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర‌కొండ న‌టించ‌నున్నారు.
    Published by:Manjula S
    First published: