టీజర్ టాక్ : ‘గీతా గోవిందం’ రొమాంటిక్ దేవరకొండ!

గీతా, గోవింద్‌గా విజయ్ దేవరకొండ, రష్మికా మందానాల మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ... ఆగస్టు 15న విడుదల!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: July 23, 2018, 2:22 PM IST
టీజర్ టాక్ : ‘గీతా గోవిందం’ రొమాంటిక్ దేవరకొండ!
‘గీతా గోవిందం’ పోస్టర్
  • Share this:
ఈ మధ్యకాలంలో వచ్చిన హీరోల్లో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యిన హీరో విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ సెన్సెషనల్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ, తన యాటీట్యూడ్‌తో క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘గీతా గోవిందం’ చిత్ర టీజర్ విడుదలయ్యింది.

‘పెళ్లిచూపులు’ చిత్రంలో సోమరిగా, బద్ధకస్తుడిగా కనిపించిన విజయ్ దేవరకొండ... ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో యాంగర్ మేనేజ్‌మెంట్ తెలియని యాంగ్రీ ఫెలోగా కనిపించాడు. ఆవేశం కలిగిన కాలేజీ కుర్రాడు, జూనియర్ డాక్టర్, ప్రేమికుడి పాత్రలో అద్భుతంగా నటించి ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ‘గీతా గోవిందం’ చిత్రంలో తనలోని రొమాంటిక్ యాంగిల్ చూపిస్తున్నాడు విజయ్.

‘గీత’ ప్రేమ కోసం పరితపించే కొంటె కుర్రాడు గోవింద్ పాత్రలో కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో ప్రారంభమైన టీజర్... హీరోయిన్, హీరోల మధ్య ముద్దు సీన్‌తో కలర్‌ఫుల్ థీమ్‌లోకి వచ్చేస్తుంది. గీతగా ‘ఛలో’ భామ రష్మికా నటించింది. రష్మికా అందంగా, కళ్లతోనే కుర్రాళ్లను పడేస్తోంది.

సినిమా కంటే ముందే ట్విట్టర్లో గీతా, గోవింద్‌గా హడావిడి చేసిన విజయ్ దేవరకొండ, రష్మికా మందానాల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ‘సోలో’, ‘యువత’, ‘ఆంజనేయులు’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పరుశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టీజర్ చూస్తుంటేనే మళ్లీ ‘సోలో’ సినిమాలో మ్యాజిక్ రిపీట్ చేసినట్టు కనిపిస్తోంది. ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదలవుతోందీ చిత్రం.

‘గీతా గోవిందం’ టీజర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...
Published by: Ramu Chinthakindhi
First published: July 23, 2018, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading