‘గీతా గోవిందం’ టీజర్ విడుదలయ్యేది ఆ రోజే!

ఈ నెల 22న ఉదయం 11 గంటల 22 నిమిషాలకు టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు ట్వీట్టర్ ద్వారా ప్రకటించిన విజయ్ దేవరకొండ!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: July 19, 2018, 1:33 PM IST
‘గీతా గోవిందం’ టీజర్ విడుదలయ్యేది ఆ రోజే!
‘గీతా గోవిందం’ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మికా మందానా
  • Share this:
‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ చేతిలో ఉన్న లిస్టు, ఆయన డేట్ల కోసం ఎదురుచూస్తూ లైన్లో వేచి ఉన్న దర్శక, నిర్మాతల లిస్టు కూడా చాలా పెద్దదే. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత ‘ట్యాక్సీవాలా’ సినిమా షూటింగ్ ముగించాడు విజయ్. అయితే గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఆ సినిమా వరుస వాయిదాలు పడుతోంది. అయితే ఆ తర్వాత మొదలెట్టిన ‘గీతా గోవిందం’ మాత్రం షూటింగ్ ముగించుకుని వచ్చే నెలలో విడుదలకు రెఢీ అయిపోయింది.

‘ఛలో’ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన రష్మీకా మందానా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి పాట విడుదలై, మంచి విజయం సాధించింది కూడా. ‘ఇంకేం... ఇంకేం కావాలే...’ అంటూ సాగే పాటను యూట్యూబ్‌లో ఇప్పటికే 11 మిలియన్ల మంది చూశారు. మొదటి పాటే సూపర్ హిట్టవ్వడంతో ‘గీతా గోవిందం’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

తాజాగా టీజర్ రిలీజ్ ముహుర్తాన్ని ఫిక్స చేసింది చిత్రయూనిట్. ఈ నెల 22న ఉదయం 11 గంటల 22 నిమిషాలకు టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు ట్వీట్టర్ ద్వారా ప్రకటించాడు హీరో విజయ్ దేవరకొండ. లుంగీలో మాస్ లుక్‌లో దర్శనమిస్తున్న విజయ్ దేవరకొండ, చీరకట్టులో ఉన్న రష్మీకాను ఎత్తుకున్న ఫోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఐ లవ్ హర్ బరువూ, బాధ్యతా’ అంటూ ఈ పోటోను ట్వీట్ చేశాడు విజయ్.

ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. గోపిసుందర్ సంగీతాన్ని అందిస్తున్న ‘గీతా గోవిందం’ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయాలని భావిస్తున్నారు.
Published by: Ramu Chinthakindhi
First published: July 19, 2018, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading