Vijay Deverakonda - Rashmika : ‘గీతా గోవిందం’, డియర్ కామ్రేడ్ సినిమాల్లోనూ వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ కాంబినేషన్ నుంచి మరో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా ఇద్దరికీ మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత ఇదే కాంబినేషన్లో వచ్చిన డియర్ కామ్రెడ్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితేనేం ఈ ఇద్దరూ ఇప్పటికే తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ జంట ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ఓ వైపు రష్మిక మందన 'మిషన్ మజ్ను' చిత్రం కోసం ముంబైలో మాకాం వేస్తే.. హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' చిత్రం కోసం అక్కడే ఉంటున్నారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో. ఇక తాజాగా ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ హోటల్ ముందు కనిపించారు. అదే సమయంలో రష్మిక చేతిలో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. వాటితోనే ఈ జంట ఫొటోలకు పోజులిచ్చారు. దీంతో నెటిజన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ పిక్స్‌ను విజయ్ స్వయంగా తెచ్చిచ్చాడేమో అని అనుకుంటున్నారు. అయితే ఈ విషయమై స్పష్టత లేదు. అయితే, ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చింది.సంతూర్ సోప్ యాడ్‌లో ఈ జంట కలిసి నటించింది. ఇప్పటికే ముంబైలో యాడ్ షూట్ పూర్తి అయింది. త్వరలో టెలికాస్ట్ కాబోయే ఈ కమర్షియల్ యాడ్‌లో విజయ్, రష్మికకు ప్రపోజ్ చేశాడు. విజయ్ మోకాళ్లపై కూర్చుని గిఫ్ట్ ఇస్తూ రష్మికకు ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘గీతా గోవిందం’, డియర్ కామ్రేడ్ సినిమాల్లోనూ వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ కాంబినేషన్ నుంచి మరో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ లో నటిస్తున్నాడు. ఇందులో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’లో హీరోయిన్గా నటిస్తోంది రష్మిక. అలాగే ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తోంది.
ఇక విజయ్ సినిమాల విషయానికి ఆయన ప్రస్తుతం లైగర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకుడు. హీరోయిన్’గా అనన్య పాండే నటిస్తోంది. చార్మీ, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ, కన్నడ మలయాళీ భాషాల్లో విడుదలకానుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.