VIJAY DEVERAKONDA LIGER ACTRESS ANANYA PANDEY CANNOT GET OUT OF THERE MHN
Ananya Pandey: విజయ్ దేవరకొండ 'లైగర్' బ్యూటీ అందులో నుంచి బయటపడలేకపోతుందట
Vijay Deverakonda Liger actress Ananya Pandey cannot get out of there
Ananya Pandey: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ... ఆ విషయాన్ని మరచిపోలేకపోతున్నానంటూ అంటోంది. ఇంతకీ అనన్య పాండే ఏ విషయాన్ని మరచిపోలేకపోతుందనే సందేహం రాక మానదు. రీసెంట్గా అనన్య పాండే షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ... ఆ విషయాన్ని మరచిపోలేకపోతున్నానంటూ అంటోంది. ఇంతకీ అనన్య పాండే ఏ విషయాన్ని మరచిపోలేకపోతుందనే సందేహం రాక మానదు. అదేనండి.. కొత్త సంవత్సరం వేడుకలను భాయ్‌ఫ్రెండ్ ఇషాన్ కట్టర్‌తో కలిసి మాల్దీవుల్లో అనన్య పాండే సెలబ్రేట్ చేసుకుందనే సంగతి అందరికీ తెలిసిందే. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు అక్కడి ఫొటోలను, వీడియోలను షేర్ చేసింది అనన్య పాండే. అది కూడా తన ఐఫోన్లోనే అనన్య పాండే చిత్రీకరించడం గమనార్హం.
ఇప్పుడు ఆ మధురానుభూతులను మరచిపోలేకపోతున్నానంటూ అనన్యపాండే అక్కడ స్మిమ్మింగ్ పూల్‌లో తనొక్కటే ఈత కొడుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 1.6 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకోవడం విశేషం. మాల్దీవుల నుంచి ఇషాన్ కట్టర్‌తో తిరిగి వచ్చిన ఈ జోడీ మీడియా కంటికి చిక్కింది. మరి తమ రిలేషన్‌పై అనన్య పాండే ఇంత వరకు ఏమీ స్పందించలేదు. అయితే ఇంతకంటే గొప్పగా రిలేషన్ గురించి ఏం చెప్పాలి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇషాన్ కట్టర్‌తో అనన్య పాండే ఖాలీ పీలీ సినిమా చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి.. రిలేసన్కు దారి తీసిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు అనన్యపాండే ప్యాన్ ఇండియా మూవీ లైగర్‌లో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోంది.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.