క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు విజయ్. ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో మరింతగా ఎదిగాడు. కాగా ఆయన ఇటీవల నటించిన 'డియర్ కామ్రెడ్', వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు కొంత నిరాశ పరిచాయి. ఆయన ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘ఫైటర్’గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా విజయ్ హిందీ చిత్ర సీమకు పరిచయం కాబోతున్నాడు. ఈ ఫైటర్‌ను తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ భాషలలో ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఫైటర్ కథ.. పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావించిన కరణ్ జోహార్, పూరి, ఛార్మిలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. కరోనా వల్ల ఏర్పడ్డ లాక్డౌన్ కారణంగా తన సినిమా షూటింగ్స్ వాయిదా పడడంతో విజయ్ తన కుటుంబంతో చాలా సరదాగా గడుపుతున్నాడు.
అంతేకాకుండా ఈ కష్టకాలంలో విజయ్ ‘దేవర ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మధ్యతరగతి కుటుంబాలకు చేతనైనంత సాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా .. మీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు సమాదానంగా విజయ్ మాట్లాడుతూ.. ఇటీవలే అమ్మవాళ్లు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. నాకు కూడా కుటుంబ జీవితం అంటే చాలా ఇష్టం. కానీ దానికి కొంత సమయం పడుతుంది. పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాలంటే నేను మానసికంగా ఇంకా పరిణతి చెందాలి. ఆ విషయంలో నేనింకా నేర్చుకోవాల్సి ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పటికీ నేను ఒక చిన్నపిల్లాడిగానే ఫీల్ అవుతున్నానని పేర్కోన్నాడు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే పూరి జగన్నాధ్ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్లో మరో సినిమాకు ఓకే చెప్పాడు విజయ్.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.