మూవీ రివ్యూ : విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’

పాజిటివ్ రివ్యూస్ అందుకుంటున్న విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రం... ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ డల్ అయ్యిందంటూ వీక్షకుల ట్వీట్లు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: August 15, 2018, 1:25 PM IST
మూవీ రివ్యూ : విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’
‘గీతగోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండ
  • Share this:
‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లోనే సెన్సెషనల్ స్టార్ అయిపోయాడు పాలమూరు పిల్లగాడు విజయ్ దేవరకొండ. బోల్డ్ అండ్ డేరింగ్ సినిమాగా వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత మనోడు ఎలాంటి సినిమాతో వస్తాడా... అని యూత్ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ‘ట్యాక్సీవాలా’ సినిమాతో వద్దామనుకున్నా, గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఆ సినిమా వాయిదా పడడంతో ‘గీతాఆర్ట్స్ 2’ బ్యానర్లో చేసిన ‘గీత గోవిందం’ సినిమా ఈరోజు విడుదలైంది.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలామంది ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘గీతా గోవిందం ఇంటర్వెల్ అయ్యింది. ఇలాంటి స్క్రిప్టులు విజయ్‌ ఎలా ఎంచుకుంటాడో అర్థం కాదు. ఇంకో బ్లాక్‌బస్టర్ పడడం ఖాయం. రెగ్యూలర్ స్టోరీగానే ఉన్నా, బ్రాండ్ న్యూ ట్విస్ట్ పెట్టారు. థియేటర్లో 60 శాతం ఫీమేల్ ఆడియెన్స్ ఉన్నారు. అందరికీ ‘గీత గోవిందం’ నచ్చింది...’’ అంటూ ట్వీట్ చేశాడో అభిమాని.
‘గీత గోవిందం’ సినిమా ఇప్పుడే చూశాను. ఈ సినిమా చూశాక టాలీవుడ్ నెక్స్ట్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అవుతాడని నమ్ముతున్నా...’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.


‘ఫస్ట్ హాఫ్‌లో ఫన్, డ్రామా, ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టి తీర్చిదిద్దారు. ఓ బస్సు జర్నీ స్టోరీకి కీలకం. విజయ్ దేవరకొండ, రష్మీకా లుక్స్ అదరగొట్టారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు...’ అంటూ ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.సినిమా మొదటి సగం చాలా బాగుంది. కానీ ద్వితియార్ధంలో మాత్రం సినిమా డ్రాప్ అయ్యింది. ‘అబో యావరేజ్’ మూవీ అంటూ రివ్యూ ఇచ్చిందో ట్విట్టర్ పేజీ.‘‘గీత గోవిందం... ఇది ‘అర్జున్‌రెడ్డి’ కాదు. కానీ చాలా సింపుల్ అండ్ కూల్ ఎంటర్‌టైనర్. విజయ్ దేవరకొండ మరోసారి అద్భుతంగా నటించాడు. రష్మికా కూడా బాగా చేసింది. కామెడీ చాలా బాగుంది. సినిమా మొత్తం ఎంజాయ్ చేశాను...’’ అంటూ ట్విట్ చేసిన ఓ నెటిజన్, సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చాడు.‘‘సినిమా కంటెంట్ వీక్‌గా ఉన్నా, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా, వెన్నెల కిషోర్ కలిసి సినిమాను కాపాడారు. పరుశురాం కామెడీ సీన్స్ బాగా తీశాడు కానీ డైలాగ్స్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. డబ్బింగ్, ఎడిటింగ్, సీన్స్ మధ్య కంటిన్యూటీ మిస్సవడం అనేది గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందిన చిత్రంలో జరగడం ఆశ్చర్యంగా ఉంది...’’ అంటూ ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షోగా సినిమాను నడిపించాడని, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుందని, ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ కొద్దిగా పడిపోయిందని రివ్యూ ఇచ్చి... 3.25/5 రేటింగ్ ఇచ్చిందో ట్విట్టర్ మూవీస్ పేజీ.

Published by: Ramu Chinthakindhi
First published: August 15, 2018, 1:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading