Home /News /movies /

Vijay Devarakonda - Puri Jagannadh: ఎట్టకేలకు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ మూవీ షూటింగ్ షురూ.. నెక్ట్స్ ప్లాన్ అక్కడే..!

Vijay Devarakonda - Puri Jagannadh: ఎట్టకేలకు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ మూవీ షూటింగ్ షురూ.. నెక్ట్స్ ప్లాన్ అక్కడే..!

Vijay Deverakonda Fighter shoot resumed finally and Puri is planning next schedule there

Vijay Deverakonda Fighter shoot resumed finally and Puri is planning next schedule there

Vijay Devarakonda - Puri Jagannadh: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ త్వరలోనే పున: ప్రారంభం కానుంది.

    విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సెట్స్‌పై ఉంది. షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల‌కే క‌రోనా ప్ర‌భావం స్టార్ట్ కావ‌డంతో సినిమా షూటింగ్‌ను ఆపేశారు. త‌ర్వాత కోవిడ్ ప‌రిమితుల్లో షూటింగ్స్ జ‌రుపుకోవచ్చున‌ని ప్ర‌భుత్వం చెప్పినా, ఎందుక‌నో పూరి, విజ‌య్ దేవ‌రకొండ సినిమానుస్టార్ట్ చేయ‌లేదు. అయితే తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రాన్ని షూటింగ్‌ను జ‌న‌వ‌రి 20 నుండి స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌. వీలైనంత త్వ‌ర‌గాఇండియాలో షెడ్యూల్ పూర్త‌వుతుంది.

    దీని త‌ర్వాత షెడ్యూల్‌ను పూరీ జ‌గన్నాథ్ విదేశాల్లో ప్లాన్ చేశాడ‌ట‌. విదేశీ ఫైట‌ర్స్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల్సి ఉంది. నిజానికి కోవిడ్ టైమ్‌లో పూరీ జ‌గ‌న్నాథ్ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేద్దామా అని ఆలోచించాడు. అయితే చివ‌ర‌కు ఎలాంటి మార్పులు లేకుండా వెయిట్ చేసి చేద్దామ‌ని వెయిటింగ్‌లో ఉండిపోయాడు. అలాగే.. పూరి కోవిడ్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఇంకా ముంబైలోనే ఉండిపోయాడు.

    అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో విడుద‌ల చేయాల‌నేది ప్ర‌స్తుత ఆలోచ‌న‌గా కనిపిస్తోంది. తెలుగులో ద‌ర్శ‌క‌త్వం చేస్తున్న పూరినే ఛార్మితో క‌లిసి తెలుగులో సినిమాను నిర్మిస్తుంటే.. హిందీలో క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌గా ఉంటున్నాడు.
    Published by:Anil
    First published:

    Tags: Ananya Panday, Charmee, Puri Jagannadh, Vijay Devarakonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు