Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు..

Vijay Devarakonda : టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లాంటీ డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: October 19, 2020, 9:13 AM IST
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు..
విజయ్ దేవరకొండ Photo : Twitter
  • Share this:
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లాంటీ డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫైటర్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్‌లో వస్తోంది. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది ఈ సినిమా. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ తర్వాత షెడ్యూల్ కూడా ముంబైలోని ధారవిలో జరగాల్సీవుండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అంతేకాదు ప్రస్తుతం పరిస్థితులు కొంత సర్దుకున్న అక్కడ షూటింగ్ జరుపుకునే అవకాశం లేదు. దీంతో ఆ ప్రణాళికను చిత్రబృందం మార్చుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాలలో ముంబై ఒకటి. లాక్ డౌన్ ముగిసినప్పటికీ అక్కడ షూటింగ్ చేయడం శ్రేయస్కరం కాదని భావిస్తుందట చిత్రబృందం. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్.

ఇక ఇటీవల ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆర్నెల్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ లో సినిమాల షూటింగులు మొదలయ్యాయి. అందులో భాగంగా కొందరు స్టార్ హీరోలు హైదరాబాదులో తమ సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నారు. మరికొందరు అవుట్ డోర్ షూటింగులకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా తన సినిమా షూటింగుకి రెడీ అవుతున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగును త్వరలోనే విదేశాలలో జరుపనున్నారని సమాచారం. ఈ సినిమా దర్శకుడు పూరి తన ఫేవరైట్ కంట్రీ బ్యాంకాక్ లో ఈ సినిమా షూటింగ్’ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాడట. దాని కంటే ముందు.. హైదరాబాద్ లో నిర్మించిన ఓ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ రిస్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఫైటర్‌ కోసం ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని ఫైట్ సీన్ షూట్ చేస్తారట. అయితే కరోనా కారణంగా ఏర్పడ్డ ఈ గ్యాప్’ను పూర్తి చేయడానికి పూరి ఇక ఏకధాటిగా షూటింగ్‌ను నిర్వహించనున్నాడట.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఎప్పటినుండో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనీ అనుకుంటున్న విజయ్‌కు ఈ సినిమా మంచి అవకాశం ఉండనుంది. మరోవైపు పూరి కూడా ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఎంతవరకూ ఆ అంచనాలను అందుకుంటుందో. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Published by: Suresh Rachamalla
First published: October 19, 2020, 9:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading