Vijay Devarakonda: వాళ్లకు ఓటు హక్కు తీసేయాలంటూ విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు..

Vijay Devarakonda |  ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఎవరీ కుర్రాడు అంటూ అందరి దృష్టిలో పడిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

news18-telugu
Updated: October 10, 2020, 1:59 PM IST
Vijay Devarakonda: వాళ్లకు ఓటు హక్కు తీసేయాలంటూ విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు..
విజయ్ దేవరకొండ (File/Photo)
  • Share this:
Vijay Devarakonda |  ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఎవరీ కుర్రాడు అంటూ అందరి దృష్టిలో పడిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి సక్సెస్‌లతో యూత్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు ‘అర్జున్ రెడ్డి’ తో రౌడీ అనే బ్రాండ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఇతను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తోన్న ‘ఫైటర్’ మూవీతో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దాంతో పాటు సుకుమార్‌తో మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌‌ను అనౌన్స్ చేసాడు.  అంతేకాదు మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా తొలి స్థానంలో నిలిచి సంచలనం క్రియేట్ చేసాడు. ఇక లాక్‌డౌన్ సమయంలో ‘ది దేవరకొండ ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించి పేదవాళ్లను బడుగులను ఆదుకున్నారు. ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్ సడలింపులతో ప్రస్తుతానికి తన సేవలకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఈ రౌడీ హీరో.. ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


లిక్కర్  కోసం  ఓటును అమ్ముకునే వాళ్లకు అసలు ఓటు హక్కు అనేది లేకుండా చేయాలని కామెంట్ చేసాడు విజయ్ దేవరకొండ. ఓ ఇంటర్వ్యూలో చిట్‌చాట్ చేస్తుండగా విజయ్ ఈ వ్యాఖ్యలు చేసాడు. పైసలు కోసం లిక్కర్ కోసం ఓటును అమ్మకానికి పెట్టే వాళ్లకు ఓటు విలువ తెలియదన్నారు. అలాంటి వాళ్లకు ఓటు హక్కు ఎందుకని విజయ్ అభిప్రాయపడ్డాడు.









మరోవైపు బాగా ధనవంతులకు కూడా ఓటు హక్కు ఉండకూడదన్నారు. చదువుకున్న మిడిల్ క్లాస్ వాళ్లకు మాత్రమే ఓటు విలువ తెలసన్నాడు. అలాంటి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నారు. విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. కొందరు విజయ్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్వీట్ చేస్తుంటే.. మరికొందరు విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్‌ను ఏకి  పారేస్తున్నారు. మొత్తంగా ఎరక్కపోయి.. విజయ్ దేవరకొండ ఇరుక్కపోయాడని అంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 10, 2020, 1:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading