Home /News /movies /

VIJAY DEVERAKONDA AND ANANYA PANDAY TEASE US WITH NEW LIGER UPDATE SB

Liger: అనన్యతో విజిల్ వేయిస్తున్న విజయ్.. లైగర్ నుంచి బిగ్ అప్ డేట్..!

లైగర్ నుంచి బిగ్ అప్ డేట్

లైగర్ నుంచి బిగ్ అప్ డేట్

మాస్ నెంబర్ గా ‘లైగర్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ సాంగ్ ను జూలై 11న రిలీజ్ చేయనున్నారు. అంతకన్నా రెండు రోజుల ముందే ప్రొమో విడుదల కానుంది.

    టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నటిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. లైగర్‌లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) జంటగా నటిస్తున్నారు.

    మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ లలో ‘లైగర్’ ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. గతంలోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఇన్నాళ్లు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ప్రస్తుతం మేకర్స్ Ligerను రిలీజ్ కు సిద్ధం చేశారు. ఈ మేరకు వరుసగా అప్డేట్స్ అందిస్తూ ఆడియెన్స్ లో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగానే మూవీ నుంచి ఇటీవల విజయ్ దేవరకొండ న్యూడ్ ఫొటోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒంటిమీద బట్టల్లేకుండా విజయ్ దేవరకొండ కనిపించడంతో అభిమానులు, ఆడియెన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ పోస్టర్ తో ఇంటర్నెట్ షేక్ అయ్యింది. హీరోయిన్లు సైతం విజయ్ న్యూడ్ ఫోటోపై వరుసగా కామెంట్లు చేశారు.



    ఇంకా పోస్టర్ వైరల్ అవుతూనే ఉండగా.. తాజాగా మరో బిగ్ అనౌన్స్ మెంట్ ను ఇచ్చారు మేకర్స్. మూవీ నుంచి మాస్ మ్యూజిక్ తో ఫస్ట్ సింగిల్ (Liger First Single)ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అదిరిపోయే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. AKDI PAKDI అనే టైటిల్ లో మాస్ నెంబర్ గా ‘లైగర్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ సాంగ్ ను జూలై 11న రిలీజ్ చేయనున్నారు. అంతకన్నా రెండు రోజుల ముందే.. జూలై 8న సాంగ్ ప్రొమోను వదలనున్నట్టు వెల్లడించారు. ఈ అనౌన్స్ మెంట్ తో పాటు అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో విజయ్, అనన్యపాండే ఇద్దరు కలిసి చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. అనన్యకు గట్టిగా పట్టుకొని విజిల్ వేయిస్తున్న స్టిల్ నెటిజన్లనను ఆకట్టుకుంటోంది.



    మరోవైపు లైగర్ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. నిర్మాతలుగా చార్మీ కౌర్, కరణ్ జోహార్ వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 25న తెలుగుతో పాటు హిందీలోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు మేకర్స్. అదేవిధంగా చిత్రంలో రమ్యకృష్ణ, అలీ, రోణిత్ రాయ్, అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Ananya Panday, Liger, Liger Movie, Vijay devarakonda liger

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు