Vijay Devara Konda: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌ని అక్క‌డ బ్యాన్ చేశారు... రీజ‌న్ ఇదే!

Vijay Deverakonda actress banned there but why

Vijay Devarakonda - Ananya Panday: బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే ఇంట్లో సభ్యులు తనతో ప్రవర్తించిన తీరుపై ఆసక్తికరమైన విషయాన్ని షేర్‌ చేసుకుంది

  • Share this:
    ఇప్పుడు అన‌న్య పాండేని చూపించి, ఈమె అన‌న్య పాండే అన‌డం క‌న్నా, విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్ అంటేనే తెలుగు వాళ్లు మ‌రింత‌గా ఓన్ చేసుకుంటారు. అవును. పూరి జ‌గ‌న్నాథ్ డైర‌క్ష‌న్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ఫైట‌ర్ అలియాస్ లైగ‌ర్ మూవీతో తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు అన‌న్య పాండే. ఈ మూవీ ప్యాన్ ఇండియా మూవీ. సో నార్త్ లో అల్రెడీ మూవీస్ చేసిన అన‌న్య పాండేకి సౌత్‌లో మాత్రం ఇదే ఫ‌స్ట్ ఎంట్రీ అన్న‌మాట‌. ఇంత‌కీ టైటిల్‌లో చెప్పిన‌ట్టుగానే అన‌న్య పాండేని అక్క‌డ బ్యాన్ చేశారు? అది కూడా ఎవ‌రో కాదు.. ఆమె సొంత బంధువులు. ఇంట్లో వాళ్లే.. వామ్మో విష‌యం అంత సీరియ‌స్సా... ఇంత‌కీ అన‌న్య‌ని ఎక్క‌డ బ్యాన్ చేశారు? ఎందుకు బ్యాన్ చేశారు? అని అనుకుంటున్నారా? అయితే ఆల‌స్యం ఎందుకు ఇక చ‌దివేయండి.

    అన‌న్య పాండేని లాక్‌డౌన్ టైమ్‌లో హౌస్ హోల్డ్ వ‌ర్క్ చేయ‌డానికి ఒప్పుకోలేద‌ట ఆమె కుటుంబ‌స‌భ్యులు. ``న‌న్ను మా ఇంట్లో వాళ్లంద‌రూ ఇంటి ప‌నులు చేయ‌నివ్వ‌కుండా బ్యాన్ చేశారు. అందుకే అంద‌రి సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ లో ఉన్న‌ట్టు ఇల్లు ఊడుస్తూ, అంట్లు తోముతూ, బాల్క‌నీ క్లీన్ చేస్తూ, చెత్త ప‌డేస్తూ ఉన్న ఫొటోలు నా హ్యాండిల్స్ లో క‌నిపించ‌వు. ఒక‌సారి నా సిస్ట‌ర్‌కి వంటింట్లో హెల్ప్ చేయ‌బోయాను. త‌న‌కి నేను చేసిన ప‌ని న‌చ్చ‌లేదు. నాకు పెద్ద ద‌ణ్ణం పెట్టి... నీ ప‌ని నువ్వు చూసుకో అనేసింది. అమ్మ‌యితే అస‌లు ఇంట్లో ఏ ప‌నీ ముట్టుకోనివ్వ‌లేదు. ఇంటి ప‌నులు చేయ‌డంలో నేను మ‌రీ బ్యాడ్ అనుకుంటా. నేను చేసిన ప‌నిని వాళ్లు రెండో సారి చేసుకోవ‌డం ఎందుకు అని అనుకున్నారేమో.. న‌న్ను ఆ ప‌నుల నుంచి బ్యాన్ చేసేశారు`` అని ఉన్న‌దున్న‌ట్టు చెప్పేశారు.

    ananya panday, bollywood, bollywood heroines, ananya panday latest news, annaya panday update, ananya panday family, vijay devarakonda heroine, puri jagannadh latest movie heroine, fighter heroine, విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌, అనన్య పాండే, పూరి జగన్నాథ్‌ లేటెస్ట్‌ మూవీ హీరోయిన్‌
    Vijay Deverakonda actress Ananya Panday


    అన్న‌ట్టు ఈ బ్యూటీ..  లాక్‌డౌన్ టైమ్‌లో ఎక్కువ‌గా ఓటీటీ కంటెంట్ చూస్తూ గ‌డిపేశార‌ట‌. మ‌రి ఇక్క‌డ మ‌న విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం ఇంటి ప‌నుల్లో మ‌ద‌ర్‌కి సాయం చేస్తూనే ఉన్నారు. సో అద‌న్న‌మాట ఫైట‌ర్ జోడీ ముచ్చ‌ట్లు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌ని అక్క‌డ బ్యాన్ చేసిన సంగ‌తి!
    Published by:Anil
    First published: