Home /News /movies /

VIJAY DEVARAKONDAS DEAR COMRADE MOVIE TO RELEASE FOUR SOUTH REGIONAL LANGUAGES TA

ఎవరికీ సాధ్యం కాలేదు.. ‘డియర్ కామ్రేడ్‌’తో విజయ దేవరకొండ సాధించబోతున్నాడు..

డియర్ కామ్రేడ్‌లో  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న Photo: Instagram/thedeverakonda

డియర్ కామ్రేడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న Photo: Instagram/thedeverakonda

Vijay Devarakonda dear Comrade | ప్రెజెంట్ ఈ కథానాయకుడు..భరత్ కమ్మ డైరెక్షన్‌లో ‘డియర్ కామ్రెడ్’ సినిమా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న  ఈసినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బాకీ ఉన్నాయి. తాజాగా ఈ సినిమాను ఒకేసారి నాలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఇంకా చదవండి ...
తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో బుల్లెట్‌లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’ సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు హీరోకు ఇంత పాపులారిటీ రాలేదని చెప్పోచ్చు.  అర్జున్ రెడ్డి తర్వాత ‘మహానటి’ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన విజయ్ దేవరకొండ..ఆ తర్వాత  పరశురామ్ దర్శత్వంలో చేసిన ‘గీతా గోవిందం’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్బులో ఎంటరయ్యాడు. రీసెంట్‌గా ‘టాక్సీవాలా’ సినిమాతో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ప్రెజెంట్ ఈ కథానాయకుడు..భరత్ కమ్మ డైరెక్షన్‌లో ‘డియర్ కామ్రెడ్’ సినిమా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న  ఈసినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బాకీ ఉన్నాయి. తాజాగా ఈ  సినిమాను తెలుగుతో పాటు కన్నడ,తమిళ్, మలయాళ భాషల్లో ఏక కాలంలో  మే 22న  రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

మరోవైపు ఈసినిమాకు సంబంధిచించిన ట్రైలర్‌ను ఈ నెల 17న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్‌గా నటిస్తున్నాడు. మరోవైపు రష్మిక మండన్న ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో నటిస్తోంది. ‘గీత గోవిందం’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగులో తెరకెక్కుతోన్న ఓ సినిమా ఒకే సారి నాలుగు భాషల్లో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు.
First published:

Tags: Kannada Cinema, Kollywood, Malayala Cinema, Malluwood, Rashmika mandanna, Sandalwood, Tamil Cinema, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు