ఒక్కోసారి మ్యాజిక్ అనేది ఒక్కసారే పనిచేస్తోంది. మళ్లీ మళ్లీ చేయాలంటే కుదరని పని. కానీ తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా...సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. ఈ సినిమాతో తెలుగులో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. అంతేకాదు ఎన్నో సినిమాల్లో నటిస్తే కానీ రానీ గుర్తింపు ఒక్క అర్జున్ రెడ్డితోనే కొట్టేసాడు. ఇక తెలుగులో రిపీటైన ఈ మ్యాజిక్ .. వేరే భాషల్లో రిపీట్ అవుతుందా అని అందరు అనుకున్నారు. కానీ హిందీలో కూడా ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్..అక్కడ అంచనాలు మించి సంచలనాలు నమెదు చేస్తుంది. తొలి రోజే.. దాదాపు రూ.20 కోట్లను తీసుకొచ్చింది. ఇక రెండో రోజు కూడా రూ. 22 కోట్లు.. మూడో రోజు ఏకంగా రూ.28 కోట్లు తీసుకొచ్చాడు. పైగా నాల్గో రోజు రూ.15 కోట్లకు పైగా వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా విడుదలైన ఐదు రోజుల్లో ఓవర్సీస్ కలిపి రూ.100 కోట్లను దాటి ట్రేడ్ వర్గాలను ఔరా అనిపించేలా చేసింది. ముందు ముందు హిందీలో కబీర్ సింగ్ ఎలాంటి సంచలనాలకు నమోదు చేస్తుందో చూడాలి.

కబీర్ సింగ్ పోస్టర్
ఇక తెలుగు,హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ అయిన అర్జున్ రెడ్డి తమిళంలో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా ‘వర్మ’ పేరుతో బాాలా దర్శకత్వంలో తెరకెక్కింది. కానీ ఫైనల్ ఔట్పుట్ మంచిగా రాకపోవడంతో ఈ సినిమాను వేరే దర్శకుడితో ‘ఆదిత్య వర్మ’ టైటిల్‌తో రీ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ధృవ్ సరసన బనితా సంధు హీరోయిన్గా నటిస్తోంది. ఇ4 ఎంటర్టైన్మెంట్ వాళ్లు హీరో ధృవ్ తప్పించి..మిగతా ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ను అందరనీ మార్చేసి మళ్లీ రీ షూట్ చేస్తున్నారు.

‘ఆదిత్య వర్మ’
మొత్తానికి యూనివర్సల్ కాన్సెప్ట్ వంటి అర్జున్ రెడ్డి సినిమాకు బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మరి తమిళ తంబీలు ‘ఆదిత్యవర్మ’సినిమాను ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి. ఇక హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ ఈ రేంజ్లో హిట్టు కావడానికి ఈ అర్జున్ రెడ్డిని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే హిందీ వెర్షన్2ను డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా విజయాన్ని నమెదు చేసింది. మరి తమిళంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు అక్కడ అర్జున్ రెడ్డి లాంటి ఎమోషన్‌ను ఏ మేరకు పండిస్తడనే దానిపై తమిళ వెర్షన్ ‘ఆదిత్య వర్మ’ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:June 26, 2019, 18:06 IST