Kabir Singh Trailer: కబీర్ సింగ్ ట్రైలర్ టాక్.. కియరా పెదాలను షాహిద్ జుర్రేసాడుగా..

విజయ్ దేవరకొండ హీరోగా...సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్ టైటిల్‌తో రీమేక్ చేసారు. అంతేకాదు ఇపుడీ మూవీ ట్రైలర్ రిలీజైంది.

news18-telugu
Updated: May 13, 2019, 3:17 PM IST
Kabir Singh Trailer: కబీర్ సింగ్ ట్రైలర్ టాక్.. కియరా పెదాలను షాహిద్ జుర్రేసాడుగా..
కబీర్ సింగ్ పోస్టర్
  • Share this:
విజయ్ దేవరకొండ హీరోగా...సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. షాలినీ పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఇపుడు అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళంలో విక్రమ్ కొడుకు ధృవ్..‘వర్మ’ టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ మూవీని ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ఈ మూవీని హిందీలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్,టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచిన మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.


షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ ట్రైలర్ చూస్తుంటే.. అర్జున్ రెడ్డి సినిమాలోని ప్రతీ సీన్‌ను మక్కీ మక్కీ దింపేసినట్టే ఉంది. మొత్తంగా తెలుగులో ఏదైతే కంటెంట్ ఉందో హిందీలో యాజిటీజ్‌గా దింపేసాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియరా అడ్వాణీ యాక్ట్  చేసింది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఈ మూవీని జూన్ 21న రిలీజ్ చేస్తున్నారు. మరి తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ సినిమా హిందీలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
First published: May 13, 2019, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading