• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • VIJAY DEVARAKONDA WORLD FAMOUS LOVER SUN NEXT RELEASE ON APRIL 15 TA

విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వచ్చే డేట్ ఫిక్స్..

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ (Twitter/Photo)

World Famous Lover | ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘వరల్ట్ ఫేమస్ లవర్’ సినిమా సన్ నెక్ట్స్‌లో విడుదల తేది ఫిక్స్ అయింది.

  • Share this:
ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, సన్‌ నెక్ట్స్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తూ ఉండగానే అమెజాన్ ప్రైమ్‌‌, జీ 5, సన్‌ నెక్ట్స్‌లో రిలీజైతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బాగానే వర్కౌట్  అయినా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ఓటీటీ ఫ్లాట్‌పామ్‌లో విడుదల కావడం ఎంతో కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అందుకే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు  రిలీజ్‌కు ముందు ఆయా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌తో  ఒప్పందం చేసుకుంటున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘వరల్ట్ ఫేమస్ లవర్’ సినిమా ఏప్రిల్ 15న సన్‌ నెక్ట్స్‌లో స్ట్రీమ్ కానున్నట్టు సన్ నెక్ట్స్ ప్రకటించింది.


‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించారు. ఓనమాలు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. మొత్తానికి థియేటర్స్‌లో ఈ సినిమా చూడని వాళ్లు.. ఎంచక్కా ఏప్రిల్ 15న ఈ సినిమాను చూడొచ్చు.
Published by:Kiran Kumar Thanjavur
First published: