• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • VIJAY DEVARAKONDA WORLD FAMOUS LOVER MOVIE TRAILER RELEASED AND IT WAS CRAZY WITH ROMANCE PK

వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్.. విజయ్ దేవరకొండ ప్రేమ పాఠాలు..

3. వరల్డ్ ఫేమస్ లవర్: పేరుకు తగ్గట్లుగానే వరల్డ్ ఫేమస్ డిజాస్టర్ అయిపోయింది ఈ చిత్రం. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని వచ్చిన విజయ్ దేవరకొండ మరోసారి నిరాశ పరిచాడు. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ చిత్రం అస్సలు ఆకట్టుకోలేకపోయింది. కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేదు వరల్డ్ ఫేమస్ లవర్.

World Famous Lover Trailer: వరల్డ్ ఫేమస్ లవర్.. ఇప్పుడు ఈ పదానికి చాలా క్రేజ్ తీసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమా ఇదే. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. మరోసారి విజయ్ పూర్తిగా అర్జున్ రెడ్డి..

  • Share this:
వరల్డ్ ఫేమస్ లవర్.. ఇప్పుడు ఈ పదానికి చాలా క్రేజ్ తీసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమా ఇదే. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత మరోసారి విజయ్ పూర్తిగా అర్జున్ రెడ్డి తరహా ప్రేమకథతోనే వస్తున్నాడని అర్థమైపోతుంది. ప్రేమంటే ఒక కాంప్రమైజ్‌కు అర్థం.. ప్రేమంటే సాక్రిఫైజ్.. ప్రేమంటే దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కావంటూ టీజర్‌లో చెప్పిన దర్శకుడు.. ఈ సారి అన్నింటికంటే స్వచ్ఛమైనది ప్రేమ అంటూ ట్రైలర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత వరసగా నలుగురు అమ్మాయిల కారెక్టర్స్ రివీల్ చేస్తూ వెళ్లాడు క్రాంతి మాధవ్. ముఖ్యంగా మధ్యలో చాలాసార్లు అర్జున్ రెడ్డిని గుర్తు చేసాడు విజయ్. హీరోయిన్లతో విజయ్ లిప్ లాక్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయిందులో.
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (world famous lover trailer)
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (world famous lover trailer)

రాశీ ఖన్నా, కేథరిన్, ఎజిబెల్లా, ఐశ్వర్యా రాజేష్‌తో వచ్చే సన్నివేశాలు కూడా చూపించాడు క్రాంతి మాధవ్. ముఖ్యంగా విజయ్, ఐశ్వర్య మధ్యే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత విజయ్ కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు విజయ్. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అక్కడ ఆయనకు కూడా ఒక్క హిట్ లేదు. గీత‌ గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాల తర్వాత వచ్చిన ఇమేజ్, మార్కెట్ ఇప్పుడు డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో విజయ్ కారెక్టర్ అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తుంది.

ప్రేమించి మోసపోయాడా లేదంటే అందర్నీ ఒకేసారి ప్రేమించాడా.. భార్యను మోసం చేస్తున్నాడా అనేది ఏదీ అర్థం కాకుండా అన్నింట్లోనూ సస్పెన్స్ మెయింటేన్ చేసాడు దర్శకుడు క్రాంతి. ఈయనకు కూడా ఈ తరహా కథ తొలిసారి చేయడం. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2020 ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రేమ నేపథ్యంలోనే ఈ చిత్రం వస్తుంది.. పైగా టైటిల్ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ కాబట్టి లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి ఈ చిత్రంతో విజయ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: