Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 3, 2020, 4:31 PM IST
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ (world famous lover trailer)
వరల్డ్ ఫేమస్ లవర్.. ఇప్పుడు ఈ పదానికి చాలా క్రేజ్ తీసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమా ఇదే. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత మరోసారి విజయ్ పూర్తిగా అర్జున్ రెడ్డి తరహా ప్రేమకథతోనే వస్తున్నాడని అర్థమైపోతుంది. ప్రేమంటే ఒక కాంప్రమైజ్‌కు అర్థం.. ప్రేమంటే సాక్రిఫైజ్.. ప్రేమంటే దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కావంటూ టీజర్ మొదలైంది. రాశీ ఖన్నా వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్లో చాలా చూపించాడు దర్శకుడు క్రాంతి మాధవ్. ముఖ్యంగా మధ్యలో చాలాసార్లు అర్జున్ రెడ్డిని గుర్తు చేసాడు విజయ్. రాశీ ఖన్నాతో లిప్ లాక్ సీన్స్ కూడా చేసాడు విజయ్ దేవరకొండ.

వరల్డ్ ఫేమస్ లవర్ పోస్టర్స్
కేథరిన్, ఎజిబెల్లా, ఐశ్వర్యా రాజేష్‌తో వచ్చే సన్నివేశాలు కూడా చూపించాడు క్రాంతి మాధవ్. 1 నిమిషం 14 సెకన్స్ టీజర్లో చాలా కవర్ చేసాడు దర్శకుడు. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత విజయ్ కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు విజయ్. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అక్కడ ఆయనకు కూడా ఒక్క హిట్ లేదు. గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాల తర్వాత వచ్చిన ఇమేజ్, మార్కెట్ ఇప్పుడు డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది. ఇందులో విజయ్ కారెక్టర్ ప్లే బాయ్ అంటున్నారు అభిమానులు.
అందుకే ఈ చిత్రానికి వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020 ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రేమ నేపథ్యంలోనే ఈ చిత్రం వస్తుంది.. పైగా టైటిల్ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ కాబట్టి లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదే ఈ సినిమాకు సరైన డేట్ అని ఫిక్స్ అయిపోయాడు దర్శకుడు క్రాంతి మాధవ్. నిర్మాత కూడా దర్శకుడితో ఆలోచనతో ఓకే అనేసాడు. ఇక విజయ్ కూడా ఓ బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మరి ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేమికుల రోజు వచ్చి ఏం చేస్తాడో చూడాలిక.
Published by:
Praveen Kumar Vadla
First published:
January 3, 2020, 4:31 PM IST