‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన విజయ్ దేవరకొండ..

తెలుగులో ‘పెళ్లిచూపులు ’ సక్సెస్‌‌తో అందరిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చేేసాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది.

news18-telugu
Updated: November 10, 2019, 4:58 PM IST
‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన విజయ్ దేవరకొండ..
వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ (Source: Twitter)
  • Share this:
తెలుగులో ‘పెళ్లిచూపులు ’ సక్సెస్‌‌తో అందరిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత చేసిన ‘గీతా గోవిందం’ వంటి డిఫరెంట్ సినిమాతో ఆకట్టుకున్నాడు. రీసెంట్‌గా చేసిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా అర్జున్ రెడ్డికి సీక్వెల్‌లా ఉందన్నా టాక్ వినబడింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కూడా నార్మల్ హీరో అయిపోయాడు. సెన్సేషనల్ హీరో అనే ట్యాగ్ లైన్ రావాలంటే కచ్చితంగా మరోసారి ఈయన బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయాల్సిందే. ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నాడు ఈయన. విజయ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో క్రాంతి మాధవ్ సినిమా కూడా ఒకటి. వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వస్తున్నాడు విజయ్. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. అంతేకాదు ఈ సినిమాకు గుమ్మడికాయ కూడా కొట్టేసారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ పూర్తిగా మేకోవర్ అయ్యాడు.

వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ (Source: Twitter)


వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిలే క్రేజీగా ఉంది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా మరో ముగ్గురు హీరోయిన్లు. ఇంతమంది హీరోయిన్ల చుట్టూ తిరగే కథ కాబట్టి దీనికి ఈ టైటిల్ పెట్టారు. మొత్తానికి డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రం ఈయన కెరీర్‌కు కీలకంగా మారింది. మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తర్వాత సరైన విజయం లేని క్రాంతి మాధవ్.. విజయ్ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...