డిజిటల్‌లో దుమ్ములేపుతున్న విజయ్ దేవరకొండ.. ఆ సంస్థకు డబ్బులే డబ్బులు..

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాదవ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్, ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్.

news18-telugu
Updated: April 19, 2020, 10:18 AM IST
డిజిటల్‌లో దుమ్ములేపుతున్న విజయ్ దేవరకొండ.. ఆ సంస్థకు డబ్బులే డబ్బులు..
5. వరల్డ్ ఫేమస్ లవర్: విజయ్ దేవరకొండ కష్టాలు 2020లో కూడా కంటిన్యూ అయ్యాయి. గతేడాది డియర్ కామ్రేడ్ సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన ఈయన.. ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్‌తో కంటిన్యూ చేసాడు. ఈ సినిమా కనీసం 10 కోట్లు వసూలు చేయలేకపోయింది.
  • Share this:
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాదవ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్, ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్. మంచి అంచనాల నడుమ ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. ఈ సినిమాలో విజయ్ మూడు భిన్న పాత్రల్లో నటించి అదరగొట్టాడు. ఎంతో కష్టపడి చేసిన ఆ సినిమా వసూళ్ల పరంగా పెద్దగా రాబట్టలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్‌లో స్ట్రీమ్ అవుతోంది. వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ ఫార్మాట్ లో దుమ్మురేపుతోంది. ఈ సినిమా డిజిటల్‌లో మంచి స్పందనను దక్కించుకుంటోంది. అంతేకాదు ఏకంగా ఈ చిత్రం ఇండియా వైడ్ గా సెకండ్ పోజిషన్ లో ట్రెండ్ అవుతుంది. వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ హక్కులను ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ రెండు రోజుల క్రితం ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ తన సబ్‌స్క్రైబర్స్‌కు అంబాటులోకి తెచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయిన వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్‌లో విశేష ఆదరణ దక్కించుకుంటూ ఇండియా వైడ్ గా నెట్ ఫ్లిక్స్ లో టాప్‌లో ట్రెండ్ అవుతూ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ కూడా థియేటర్స్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో విజయం సాధించింది. ఇక ప్రస్తుతం విజయ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. దాదాపు ఓ నలబై రోజుల పాటు ముంబైలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
Published by: Suresh Rachamalla
First published: April 19, 2020, 10:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading