టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) దేశ సరిహద్దులో డ్యూటీ చేస్తున్న వారిని కలిసి వారితో కొంత సమయాన్ని గడిపారు. ఎన్డిటివి ఛానల్ ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ తో జై జవాన్ అనే ఓ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రోమోలతో ఈ కార్యక్రమం పై మంచి అసక్తి పెంచారు. దీపావళి సందర్భంగా ఈ కార్యక్రమం ఫుల్ ఎపిసోడ్ విడుదల చేయగా.. ఈ వీడియోలో విజయ్ దేవరకొండను చూసి మురిసిపోతున్నారు ఆయన ఫ్యాన్స్.
ఈ ఎపిసోడ్ లో ఉరి బోర్డర్ లో డ్యూటీ చేస్తున్న జవాన్ లను కలిసి వారి విధి విధానాలు, డ్యూటీలో వున్న వారి సాధకబాధలను తెలుసుకున్నారు విజయ్ దేవరకొండ . వారితో కలిసి కొన్ని యుద్ధ మెళకువలు తెలుసుకున్నారు. ఫైరింగ్ ఎలా చేయాలో, బోటింగ్ ఎలా చేయాలి అనే విషయాలను ఆయన నేర్చుకున్నారు. అంతేకాదు వారితో సరదాగా ఆటలాడుతూ వారిని ఉల్లాస పరిచారు.
చివరిగా జవాన్ లతో కలిసి చిందులు వేశారు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన లైగర్ సినిమా లోని డైలాగ్ ను చెప్పి అందరిలో నూతనోత్తేజాన్ని నింపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రీసెంట్ గా `లైగర్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ.. ఆశించిన ఫలితం రాబట్టలేకపోయారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ బాక్సాఫీసుపై దాడి చేయలేకపోయింది. ఈ సినిమా పరాజయంతో కాస్త నిరాశ చెందిన విజయ్ దేవకొండ ఇలా ఇలాంటి యాక్టివిటీస్‌లో పాల్గొంటూ ఆయా చేదు జ్ఞాపకాలు మరచిపోతున్నట్లు టాక్.
లైగర్ తర్వాత ఖుషీ సినిమాకు కమిటయ్యారు విజయ్ దేవరకొండ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ మూవీ తర్వాత `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట విజయ్ దేవరకొండ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Army, Tollywood, Vijay Devarakonda