పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ... అధికారికంగా చార్మి ప్రకటన

Vijay Devarakonda : 'ఇస్మార్ట్ శంకర్‌'తో సూపర్ హిట్ అందుకున్న పూరీ ఓ సూపర్ క్రేజీ పాత్రను విజయ్ కోసం డిజైన్ చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన చార్మీ అధికారికంగా ప్రకటించి.. ఈ ఇద్దరీ కాంబీనేషన్‌లో వస్తున్న సినిమా నిజమేనంటూ కన్ఫామ్ చేసింది.

news18-telugu
Updated: August 12, 2019, 3:35 PM IST
పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ... అధికారికంగా చార్మి ప్రకటన
Photo : Twitter.com/Charmmeofficial
news18-telugu
Updated: August 12, 2019, 3:35 PM IST
Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఆయన తెలుగులోనే కాదు అన్ని భాష‌ల్లోనూ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఇటీవలే నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే విజయ్, డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ ఓ క్రేజీ పాత్రలో అలరించనున్నారని టాక్. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు వైవిధ్యమైన పాత్రలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రామ్‌చరణ్ కూడా 'రంగస్థలం' సినిమాలో మాటలు వినపడని వ్యక్తి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే రవితేజ కూడా 'రాజాదిగ్రేట్' సినిమాలో కళ్లు కనపడని వ్యక్తిగా నటించాడు. అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా 'జైలవకుశ' చిత్రంలో మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ కూడా పూరి దర్శకత్వంలో  అలాంటీ ఓ వినూత్న పాత్రలో కనిపించనున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్‌'తో సూపర్ హిట్ అందుకున్న పూరీ ఓ సూపర్ క్రేజీ పాత్రను విజయ్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. పూరీ సొంత నిర్మాణంలో వచ్చే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ.. మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా నటించనున్నాడని టాక్.
First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...