డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ.. తండ్రితో పోరుకు రెడీ..

‘ఇస్మార్ట్ శంకర్’ లాంటీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: April 21, 2020, 11:10 AM IST
డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ.. తండ్రితో పోరుకు రెడీ..
వరస ఫ్లాపులు వస్తున్నా కూడా విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు వచ్చిన నష్టమైతే ఏం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అలా ఉన్నాయి. ఇన్ని రోజులు చిన్న దర్శకులతో పని చేసాడు కానీ ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు.
  • Share this:
‘ఇస్మార్ట్ శంకర్’ లాంటీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓ 40 రోజుల పాటు ముంబైలో షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగాల్సీ వుండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో విజయ్ ఓ బాక్సర్‌గా కనిపించనున్నాడు. విజయ్‌కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. ఛార్మీ, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. దాదాపు ఇండియాలోని అన్ని ప్రధాన భాషాల్లో విడుదలకానుంది ఈ సినిమా. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకు పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని.. సమాచారం. అంతేకాదు ఆ తర్వాత సొంత తండ్రికి కొడుకు మధ్య ఆసక్తికర పోరు నడుస్తుందని తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ తాజా సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే రెండు రోజుల కింద నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించింది. ఇక విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు. దిల్ రాజు నిర్మించనున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: April 21, 2020, 11:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading