మెగా హీరో ఆఫర్ కొట్టేసిన విజయ్ దేవరకొండ..

విజయ్ దేవరకొండ (Source:Twitter)

గత  కొన్నేళ్లుగా ఏ భాషలోనైనా ఏదైనా సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆ సినిమాను రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌లో ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదలైన ‘గల్లీ బాయ్’ సినిమా సూపర్ హిట్టైయింది.ఇపుడీ సినిమాను విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో రీమేక్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

  • Share this:
గత  కొన్నేళ్లుగా ఏ భాషలోనైనా ఏదైనా సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆ సినిమాను రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌లో ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదలైన ‘గల్లీ బాయ్’ సినిమా సూపర్ హిట్టైయింది. రూ.40 కోెట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ  సినిమా దాదాపు రూ.250 కోట్లను వసూలు చేసింది. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ నటించిన ఈ సినిమాను జోయా అక్తర్ డైరెక్ట్ చేసింది. ఇక  బాలీవుడ్‌లో సూపర్ హిాట్టైన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.  ముందుగా ‘గల్లీబాయ్’ రీమేక్‌ను సాయి ధరమ్ తేజ్‌తో రీమేక్ చేయాలనుకున్న ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ దగ్గర ఆగింది. విజయ్ కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

vijay devarakonda will act in ranveer singh's gully boy in telugu remake,gully boy,vijay devarakonda,gully boy vijay deverakonda,gully boy remake vijay devarakonda,gully boy telugu remake,vijay devarakonda new movie,vijay devarakonda latest news,vijay devarakonda in arjun reddy movie,vijay devarakonda in arjun reddy,vijay devarakonda interview,zoya akhtar gully boy,gully boy teaser,vijay deverakonda upcoming hindi dubbed movie,ishaan khattar gully boy rapping,gully boy sequel,ranvir singh gully boy,vijay devarakonda dear comrade,tollywood,bollywood,telugu cinema,jabardasth,jabardasth comedy show,hindi cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ గల్లీ బాయ్ రీమేక్,విజయ్ దేవరకొండ రణ్‌వీర్ సింగ్ గల్లీ బాయ్ రీమేక్,విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్,విజయ్ దేవరకొండ న్యూ మూవీ,తెలుగు సినిమా,బాలీవుడ్,హిందీ సినిమా,
‘గల్లీ బాయ్’లో రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్


ప్రస్తుతం విజయ్ దేవరకొండ..భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇంకోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. మరి ‘గల్లీ బాయ్’ రీమేక్ ‌ను తెలుగులో ఎవరి దర్శకత్వంలో రీమేక్  చేస్తాడనేది చూడాలి.

 
First published: