Home /News /movies /

VIJAY DEVARAKONDA TO WORK WITH TRIVIKRAM SRINIVAS HERE ARE THE DETAILS SR

Vijay Devarakonda | Trivikram : త్రివిక్రమ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ.. అదిరిన రౌడీ హీరో లైనప్..

Vijay Devarakonda Trivikram Srinivas movie Photo : Twitter

Vijay Devarakonda Trivikram Srinivas movie Photo : Twitter

Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక అది అలా ఉంటే విజయ్ గురించి ఓ ఖతర్నాక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక అది అలా ఉంటే విజయ్ గురించి ఓ ఖతర్నాక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. విజయ్ ప్రస్తుతం లైగర్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి త్రివిక్రమ్‌తో (Vijay Devarakonda Trivikram Srinivas movie)  వచ్చే సినిమా వీటి కంటే ముందు మొదలుకానుందా.. లేకా ఈ సినిమాలు అన్ని పూర్తి అయ్యాక స్టార్ట్ కానుందా అనేది తెలియాల్సి ఉంది. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమాను చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ నిర్మించ‌నున్న ఈ సినిమా.. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్క‌నుంద‌ట‌.

  ఇక లైగర్ విషయానికి వ్తే.. ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉండనుందట. అయితే ఈ పాటలో యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier)  చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలో అధికారిక సమాచారం వెలువడనుంది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఇక విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  చాలా రోజుల నుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.

  Raashi Khanna : దక్షిణాది వాళ్లు నా శరీరాకృతిని చూసి ఎగతాళి చేసేవారు : రాశీ ఖన్నా కామెంట్స్ వైరల్..

  ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్  Liger)  తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు.  ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది.

  ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారట పూరీ. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

  RRR | Karnataka : వివాదంలో ఆర్ ఆర్ ఆర్.. కర్నాటక రాష్ట్రంలో విడుదలపై గందరగోళం..

  ఇక మరోవైపు లైగర్ పూర్తి కాగానే.. పూరీ మరోసారి విజయ్‌తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పూరీ జనగణమన పేరుతో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ హీరోగా నటించాల్సీ ఉంది. అయితే ఆ సినిమా ఏవో కారణాల వల్ల ముందుకు పోలేదు. ఇప్పుడు అదే సినిమాను పూరీ, విజయ్‌తో చేయనున్నారని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Liger Movie, Tollywood news, Trivikram Srinivas, Vijay Devarakonda

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు