విజయ్ దేవరకొండ ఓ సెన్సేషనల్ స్టార్.. ఆయన వ్యక్తిత్వం విలక్షణంగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటున్నారు. విజయ్ ప్రస్తుతం లైగర్ అనే సినిమా చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో లైగర్ (Liger )పై మంచి అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda )లైగర్ సినిమాతో ఈ సారి ప్యాన్ ఇండియా లెవల్లో వస్తున్నారు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. లైగర్ తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో విడుదలకానుంది. విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే (Ananya Panday) నటిస్తోంది. ఇక ఈ సినిమా ఇలా ఉండగానే ఆయన మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. దిల్ రాజు (Dil Raju) నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. హరీష్ శంకర్ (Harish Shankar) ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా పూర్తవ్వగానే విజయ్‌తో సినిమా ఉండోచ్చని అంటున్నారు.
ఇక విజయ్ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేయనున్నారు. సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా రానుందని తెలుస్తోంది. ఈ సినిమా అవ్వగానే సుకుమార్ విజయ్‌తో చేయనున్నారని టాక్. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.
ఇక విజయ్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం లైగర్ విషయానికి వస్తే.. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ భారీ స్థాయిలో దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇక విజయ్ మరో హిందీ సినిమాకు సై అన్నట్లు టాక్ నడుస్తోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dil raju, Harish Shankar, Vijay Devarakonda