అప్పుడు కాదన్నాడు.. ఇప్పుడు రెడీ అయ్యాడు.. విజయ్ దేవరకొండ కొత్త స్ట్రాటజీ..

సినిమాల్లో రాణించాలంటే సక్సెస్ కంపల్సరీ. ఇండస్ట్రీ కూడా సక్సెస్ చుట్టే తిరుగుతోంది. తాజాగా  విజయ్ దేవరకొండకు ఈ విషయం బోద పడినట్టుంది.

news18-telugu
Updated: August 14, 2019, 12:22 PM IST
అప్పుడు కాదన్నాడు.. ఇప్పుడు రెడీ అయ్యాడు.. విజయ్ దేవరకొండ కొత్త స్ట్రాటజీ..
విజయ్ దేవరకొండ Photo: Instagram.com/thedeverakonda/
  • Share this:
సినిమాల్లో రాణించాలంటే సక్సెస్ కంపల్సరీ. ఇండస్ట్రీ కూడా సక్సెస్ చుట్టే తిరుగుతోంది. తాజాగా  విజయ్ దేవరకొండకు ఈ విషయం బోద పడినట్టుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన‘ టెంపర్’ తరువాత పెద్దగా హిట్ లేని పూరీ  జగన్నాథ్.. ఇటీవల రామ్‌తో తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్‌’ విజయంతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బీ, సీ సెంటర్లలో ఫుల్ కలెక్షన్లను రాబట్టి.. రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు అదే ఊపులో విజయ్ దేవరకొండ కోసం మరో పవర్‌ఫుల్ స్టోరీని రాసుకున్నాడట పూరీ. ఐతే ఇటీవల ‘డియ‌ర్ కామ్రేడ్’ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇదే విష‌యం గురించి విజ‌య్‌ని అడిగితే... పూరితో సినిమానా..? అబ్బే అలాంటిది ఏం లేదే..? అని చెప్పాడు విజయ్ దేవరకొండ. తాజాగా పూరీతో సినిమా చేయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు.

Photo : Twitter.com/Charmmeofficial


ఐతే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడింది. దీంతో విజయ్ దేవరకొండకు తత్వం బోధ పడింది. అందుకే పూరీ జగన్నాథ్‌తో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. పూరీ సినిమాల్లో కథ లేకపోయినా.. హీరో‌ను మాస్‌కు నచ్చేలా ప్రెజెంట్ చేయడంలో దిట్ట. అందుకే విజయ్ దేవరకొండ..తనకు వెంటనే మాస్‌ను దగ్గరయ్యేలా చేయడంలో పూరీ జగన్నాథ్‌ను మించిన బెస్ట్ ఆప్షన్ లేదు. అందుకే వెంటనే పూరీ జగన్నాథ్‌తో నెక్ట్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండను పూరీ స్క్రీన్ పై ఏ రకంగా చూపిస్తాడనేది ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది.

 

First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు