పవన్ కల్యాణ్, రవితేజ దారిలోనే విజయ్ దేవరకొండ.. పూరీ మార్క్..

అవును.. ఇప్పుడు నిజంగానే విజయ్ ఇదే చేయబోతున్నాడు. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు కనిపించినా కూడా వరస సినిమాలు అయితే చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 23, 2019, 3:43 PM IST
పవన్ కల్యాణ్, రవితేజ దారిలోనే విజయ్ దేవరకొండ.. పూరీ మార్క్..
విజయ్ దేవరకొండ పవన్ రవితేజ (Source: Twitter)
  • Share this:
అవును.. ఇప్పుడు నిజంగానే విజయ్ ఇదే చేయబోతున్నాడు. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు కనిపించినా కూడా వరస సినిమాలు అయితే చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. ఇది పూర్తైన తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాతో బిజీ కానున్నాడు. ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ పెట్టాడు పూరీ. అయితే ఈ చిత్ర షూటింగ్ మొదలవ్వడానికి మాత్రం మరో ఆర్నెళ్లు టైమ్ పట్టనుంది. అక్టోబర్ వరకు క్రాంతి సినిమా అయిపోయినా కూడా ఆ తర్వాత థాయ్ లాండ్ వెళ్లబోతున్నాడు విజయ్.
Vijay Devarakonda to follow Pawan Kalyan and Ravi Teja in his new movie Fighter with Puri Jagannadh pk అవును.. ఇప్పుడు నిజంగానే విజయ్ ఇదే చేయబోతున్నాడు. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు కనిపించినా కూడా వరస సినిమాలు అయితే చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. vijay devarakonda,puri jagannadh,vijay devarakonda fighter movie,vijay devarakonda martial arts,vijay devarakonda janhvi kapoor,vijay devarakonda pawan kalyan,vijay devarakonda ravi teja,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేరవకొండ పూరీ జగన్నాథ్,విజయ్ దేవరకొండ జాన్వీ కపూర్,విజయ్ దేవరకొండ పవన్ కల్యాణ్ రవితేజ,
Photo : విజయ్ దేవరకొండ Twitter.com/Charmmeofficial

దానికి కూడా ప్రత్యేకంగా కారణాలున్నాయి. ఫైటర్ సినిమా కథ అలా ఉంది మరి. ఈ చిత్రంలో విజయ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. దాని కోసమే ఈయన శిక్షణ తీసుకోబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. అందుకే థాయ్ లాండ్ వెళ్లి రెండు నెలల పాటు అక్కడే ఉండబోతున్నాడు దేవరకొండ. గతంలో పవన్ కల్యాణ్, రవితేజ లాంటి హీరోలు కూడా ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేసారు. తమ్ముడు, అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి లాంటి సినిమాల్లో మెయిన్ స్టోరీ ఇదే.

Vijay Devarakonda to follow Pawan Kalyan and Ravi Teja in his new movie Fighter with Puri Jagannadh pk అవును.. ఇప్పుడు నిజంగానే విజయ్ ఇదే చేయబోతున్నాడు. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు కనిపించినా కూడా వరస సినిమాలు అయితే చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. vijay devarakonda,puri jagannadh,vijay devarakonda fighter movie,vijay devarakonda martial arts,vijay devarakonda janhvi kapoor,vijay devarakonda pawan kalyan,vijay devarakonda ravi teja,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేరవకొండ పూరీ జగన్నాథ్,విజయ్ దేవరకొండ జాన్వీ కపూర్,విజయ్ దేవరకొండ పవన్ కల్యాణ్ రవితేజ,
విజయ్ దేవరకొండ జాన్వీ కపూర్ (Source: Twitter)

ఇందులో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి పూరీ నుంచి వచ్చిందే. ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండను అలాంటి పాత్రలో చూపించబోతున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించబోతుందని తెలుస్తుంది. గతంలోనే తనకు విజయ్ అంటే ఇష్టమని.. తనతో నటించాలని ఉందని చెప్పింది జాన్వీ. ఇప్పుడు పూరీ జగన్నాథ్ పుణ్యమా అని ఇది నెరవేరబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...